India-China : భారత్, చైనా సైనికాధికారుల కోర్ కమాండర్ స్థాయి చర్చలు

నేడు భారత్, చైనా సైనికాధికారుల 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో ప్రతిష్ఠంభన, బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగనున్నాయి.

India-China : భారత్, చైనా సైనికాధికారుల కోర్ కమాండర్ స్థాయి చర్చలు

India China

Core commander level talks : నేడు భారత్, చైనా సైనికాధికారుల 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో ప్రతిష్ఠంభన, బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగనున్నాయి. చైనా భూ భాగం మోల్డో వద్ద ఉదయం 10.30 సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో హాట్ స్ప్రింగ్స్, గోగ్రా హైట్స్ నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల సైనిక అధికారులు చర్చించనున్నారు.

భారత్ తరపున లేహ్​లోని 14 కార్ప్స్​ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ చర్చల బృందానికి నేతృత్వం వహించనున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను సత్వరమే పరిష్కరించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దెస్పంగ్, దెమ్​చోక్ ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభనకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద చైనా సైన్యం చొరబాటు ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజా సైనిక చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

WhatsApp: వాట్సప్ ప్రొఫైల్ పిక్ కనిపించకుండా హైడింగ్ ఆప్షన్

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్​లోని యాంగ్​ట్సే ప్రాంతం, ఉత్తరాఖండ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బారాహోటి సెక్టార్​, తూర్పు లద్దాఖ్ ప్రాంతాల్లో చైనా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లడ్డాక్ లో సరిహద్దు వివాదం తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకు కమాండర్ స్థాయి అధికారులు 12 సార్లు చర్చలు జరిపారు.