lockdown :10 రోజులుగా తల్లీ,ఐదుగురు పిల్లలు ఆకలితోనే

ఐదుగురు పిల్లలతో సహా ఓ తల్లి పస్తులతో అల్లాడిపోయింది. 10 రోజులపాటు ఆకలితో అలమటించిపోయిన అత్యంత దయనీయమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి ఎందరి కడుపులు కొడుతోందో తెలియజెప్పే ఈ దయనీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. 10 రోజులుగా ఓ తల్లి తన ఐదుగురు పిల్లలతో ఇంట్లోనే ఆకలితో అలమటించిపోయింది.కన్నబిడ్డకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాననే బాధతో అల్లాడిపోయిన దయానీయ ఘటన లాక్ డౌన్ దీన కథలకు సాక్ష్యంగా నిలిచింది.

lockdown :10 రోజులుగా తల్లీ,ఐదుగురు పిల్లలు ఆకలితోనే

Lockdown

5 childrence mother hospitalised : లాక్ డౌన్. ఎంతోమంది జీవితాలను కల్లోలం చేసిపారేసింది. నడివీధిలో నిలబెట్టేసింది. తినటానికి తిండి కూడా లేకుండా చేసింది. పసిబిడ్డలు కూడా ఆకలితో అలమటించిపోయిన దుర్భర పరిస్థితులకు నెట్టేసింది. అటువంటి ఓ ఘోరమైన పరిస్థితుల్లో ఐదుగురు పిల్లలతో సహా ఓ తల్లి పస్తులతో అల్లాడిపోయింది. 10 రోజులపాటు ఆకలితో అలమటించిపోయిన అత్యంత దయనీయమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

కరోనా మహమ్మారి ఎందరి కడుపులు కొడుతోందో తెలియజెప్పే ఈ దయనీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. కన్నబిడ్డకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాననే బాధతో అల్లాడిపోయిన దయానీయ ఘటన లాక్ డౌన్ దీన కథలకు సాక్ష్యంగా నిలిచింది. గుడి అనే 40 మహిళ భర్తను కరోనా మొదటివేవ్ లో పొట్టనపెట్టుకుంది. గతంలో భార్యాభర్తలిద్దరూ కష్టపడి పిల్లల్ని పోషించుకునేవారు. భర్త మరణంతో ఐదుగురు పిల్లల బాద్యత గుడి మీదా 20 ఏళ్ల ఆమె పెద్ద కొడుకు మీదా పడింది. గుడి ఓ ఫ్యాక్టరీలో కార్మికురాలిగా చేరింది. కొడుకు రోజువారి కూలిపనులకు వెళు అంతో ఇంతో సంపాదిస్తున్నారు.కానీ మరోసారి కరోనా పంజా విసరటంతో సెకండ్ వేవ్ తో మరోసారి లాక్ డౌన్ తో గుడి పని కోల్పోయింది. దీంతో రూపాయి సంపాదన లేక ఇంటికే పరిమితం అయిపోయారు.

ఏప్రిల్ లో విధించిన లాక్ డౌన్ తో వారి బతుకులు చిందరవందరయ్యాయి. ఉన్న పని పోయింది. కొన్ని రోజుల పాటు ఎంతో కొంత తిన్నారు. రోజులు గడిచేకొద్దీ తినటానికి తిండి లేకుండాపోయింది. అప్పు పుట్టని పరిస్థతి. దీంతో ఇరుగు పొరుగువారు దయతలచి పెట్టే రొట్టెలే దిక్కయ్యాయి. వాటినే అందరూ పంచుకుని తిని బతికారు. కానీ ఈ కరోనా కష్టంలో ప్రతీ ఒక్కరికి ఆర్థిక సమస్యలతోనే కాలం గుడపుతున్నారు.అలా కొన్నిరోజులకు పెట్టే రొట్టెలు కూడా కరువయ్యాయి. దీంతో పది రోజులు తిండి లేక ఆకలితో అలమటించిపోయారు.నీరసించి పోయారు. వారి దుస్థితిని చూడలేక ఇరుగుపొరుగువారు వారిని మంగళవారం (జూన్ 15,2021) అలీగఢ్ లోని మల్ఖాన్ సింగ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆసుపత్రిలో పెట్టే ఆహారం తిని బతుకులీడుస్తున్నారు.

ఈ దయనీయ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్.. వెంటనే అధికారులను ఆసుపత్రికి పంపించి వారికి ఆర్థిక సాయంతో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. రూ.5 వేల నగదు..నిత్యావసర వస్తువులు..ఇతర సరుకులను అందించారు.వెలుగులోకి రాని ఇటువంటి ఘటనలు ఇంకెన్నో ఈ లాక్ డౌన్ కష్టాలతో అల్లాడిపోతున్నాయి. ఈక్రమంలో ఇంటింటి సర్వే చేసి అవసరమైనవారికి సహాయం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.