భారతదేశంలో తగ్గిన వేస్ట్ ఫుడ్, కరోనా ఎఫెక్ట్

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 10:41 AM IST
భారతదేశంలో తగ్గిన వేస్ట్ ఫుడ్, కరోనా ఎఫెక్ట్

food wastage in India కరోనా..కారణంగా..ప్రజల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు వేస్ట్ ఫుడ్ బాగా మిగిలేది. కానీ..ప్రస్తుతం ఆ సీన్ కనిపించడం లేదు. ఆహార వృథా తగ్గించేస్తున్నారు. రెస్టారెంట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, విందులు, వినోదాలు లేకపోవడంతో ఆహారం వృథా కావడం లేదంటున్నారు నిపుణులు.




లాక్ డౌన్ కు ముందున్న పరిస్థితులతో పోలిస్తే..40 నుంచి 18 శాతానికి ఆహార వృథా తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఎక్కువ వంటకాలు, రాత్రి మిగిలిన వంటకాలను మరుసటి రోజు పారేయడం, బయటి ఆహారాన్ని తెచ్చుకోవడం వంటి అలవాట్లతో పట్టణాల్లో వృథా 50–55 శాతం ఉంటుంది. అది గ్రామాల్లో 30–35 శాతమే.
https://10tv.in/5-countries-of-armed-forces-will-be-strong-by-2030-china-will-overcome-us-by-this-time/



అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్‌ వంటి రోగాలు వస్తాయని, దీని బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. క్రమ క్రమంగా వైరస్ అధికమౌతుండడంతో విటమిన్లతో కూడిన ఫుడ్ ను తింటున్నారు.

ప్రధానంగా..పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, బ్రౌన్ రైస్ వాటిని తింటున్నారు. ఇంట్లో నూనె వంటకాలను బాగా తగ్గించేశారు. ఎక్కువ వంటలు చేసుకుని పారేయడం వంటివి చూస్తుంటాం. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
ఇక ఇందులో కీలకమైన అంశం. ప్రజల ఆదాయం భారీగా కోల్పోవడమే. ఉద్యోగాలు పోవడం, మార్కెట్ లో రేట్లు అధికం అవుతుండడంతో పొదుపు మంత్రం పఠిస్తున్నారు.




పట్టణ ప్రజల ఆదాయం సుమారు 40 శాతం మేర తగ్గింది. నెల చివరికొచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. తాజాగా ఉండే ఆహారాన్నే స్వయంగా వండుకునే అలవాట్లు పెరిగాయి. హైదరాబాద్‌లోనే 75 శాతానికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. చాలా రెస్టారెంట్లు తమ మెనూ తగ్గించాయి. డిమాండ్‌ ఉన్న కొద్ది వంటకాలనే అందుబాటులో ఉంచాయి. దీంతో వృథా చాలా మేరకు తగ్గిందంటున్నారు..