Corona : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం వరకు కరోనా కేసులు 30 వేలకు దిగువన నమోదుకాగా గురువారం నుంచి కరోనా కేసుల ఉదృతి పెరిగింది.

Corona : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases (4)

Corona : గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం వరకు కరోనా కేసులు 30 వేలకు దిగువన నమోదుకాగా గురువారం నుంచి కరోనా కేసుల ఉదృతి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 35,662 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,40,639 యాక్టివ్ కేసులు ఉండగా 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా రికవరీ కంటే కరోనా కేసులే అధికంగా నమోదయ్యాయి. కొత్తగా 33,798 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read More : US : కాబూల్‌లో డ్రోన్ దాడి, తప్పు చేసి లెంపలేసుకున్న అమెరికా

మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వడంలో భారత్ ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా టీకా డ్రైవ్ నిర్వహించి 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్‌ తుడిపివేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. శుక్రవారం 14,48,833 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.

Read More : BPCL : బీపీసీఎల్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దేశంలోని 27 రాష్ట్రాల్లో కలిపి కరోనా కేసులు 11 వేలు నమోదైతే.. ఒక్క కేరళలోనే 23 వేల కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు కేరళ నుంచే వస్తున్నాయి. ఇక మరణాల రేటు కూడా ఇక్కడే అధికంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో 500లకు తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రం నజర్ పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖను అలెర్ట్ చేసింది. కేరళలో కేసుల పెరుగుదలకు కారణాలు తెలుసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.