Corona Cases : గత మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు

గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది.

10TV Telugu News

Corona Cases : గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,570 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,42,923 కు చేరింది.

Read More : Corona : భౌతిక దూరం 6 అడుగులు సరిపోదు..!

కరోనా పాజిటివిటి రేటు 98.96 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 413 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,43,928 కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 76,57,17,137 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 64,51,423 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read More : HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

దేశంలో రికవరీ రేటు అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38, 303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీ అయినవారి సంఖ్య 3,25,60,474గా ఉంది.