Corona : దేశంలో కరోనా తగ్గినట్లేనా? 27 రాష్ట్రాల్లో తగ్గుముఖం.. కేరళలో మాత్రం

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలావరకు తగ్గింది. కరోనా మృతులు చాలావరకు తగ్గాయి.

Corona : దేశంలో కరోనా తగ్గినట్లేనా? 27 రాష్ట్రాల్లో తగ్గుముఖం.. కేరళలో మాత్రం

omicron

Corona : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలావరకు తగ్గింది. కరోనా మృతులు చాలావరకు తగ్గాయి. శుక్రవారం విడుదలైన హెల్త్ బులిటెన్‌లో దేశ వ్యాప్తంగా 16,862 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక కరోనా నుంచి కోలుకొని 19,391 మంది ఇళ్లకు వెళ్లారు. దేశ వ్యాప్తంగా 379మంది మృతి చెందారు. కేరళను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో 1000 తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

చదవండి :   ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు

దేశంలోనే అత్యంత పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతుంది. మరణాలు కూడా 10 లోపే నమోదవుతున్నాయి. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది ఇళ్లకు వెళ్లి మరి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వైద్య సిబ్బంది చొరవతో దేశంలో వ్యాక్సినేషన్ 100 కోట్లకు చేరువైంది.

తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,33,82,100 కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,51,814 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 2,03,678 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మన దేశంలో టెస్ట్ పాజిటివిటీ రేటు గత 11 రోజులుగా 2శాతం కంటే తక్కువే నమోదవుతోంది.

చదవండి :  దేశంలో కొత్తగా 14,313 కోవిడ్ కేసులు

వరుసగా నాలుగో రోజు 1.5శాతం కంటే దిగువన ఉంది. ఐతే మిజోరం (14.72), కేరళ, (11.21) మణిపూర్‌ (4.90)లో మాత్రం ఎక్కువగా ఉంది. కేరళలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఐతే నిన్న 10వేల లోపే కేసులు వచ్చాయి. 9246 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో 2384 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

కేరళ ముప్పే ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతుంది. ఇక్క నిత్యం 10వేలకు పైనే కరోనా కేసులు బయటపడుతున్నాయి. దేశం మొత్తం కరోనా అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మరణాలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికి కరోనా కేసుల పెరుగుదల మాత్రం ఆగడం లేదు.