కరోనా కల్లోలం, మరోసారి 18వేలకు పైగా కొత్త కేసులు

భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల 599 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కరోనా కల్లోలం, మరోసారి 18వేలకు పైగా కొత్త కేసులు

corona cases update in india: భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల 599 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.12 కోట్లకు పైబడగా.. 1,88,747 యాక్టివ్ కేసులున్నాయి. ఆ రేటు 1.68 శాతంగా కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 97 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,57,853 మంది ప్రాణాలు వదిలారు. ఇక నిన్న(మార్చి 7,2021) ఒక్కరోజే 14వేల 278 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ నుంచి బయటపడినవారి సంఖ్య 1,08,82,798కి చేరింది. రికవరీ రేటు 96.91 శాతంగా ఉంది. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్నటివరకు 2కోట్ల 09లక్షల 89వేల 010 మందికి కరోనా టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,62,065 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.74 కోట్లు దాటింది. కొత్తగా 5,519 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26.04 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.18 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.

అమెరికాలో కొత్తగా 39,586 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2.96 కోట్లు దాటింది. కొత్తగా 704 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 5.37 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్ (80,024) టాప్‌లో కొనసాగుతుంటే… అమెరికా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.