ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

భారత్‌లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా..1,57,930 మంది ప్రాణాలు వదిలారని మంగళవారం(మార్చి 9,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న(మార్చి 8,2021) 7,48,525 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

corona cases india: భారత్‌లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా..1,57,930 మంది ప్రాణాలు వదిలారని మంగళవారం(మార్చి 9,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న(మార్చి 8,2021) 7,48,525 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.

యాక్టివ్ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 1,87,462 యాక్టివ్ కేసులుండగా..ఆ రేటు 1.67కి తగ్గింది. 24 గంటల్లో 16వేల 596 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటివరకు 1,08,99,394 మంది వైరస్‌ను జయించగా..ఆ రేటు 96.93 శాతంగా ఉంది.

మరోవైపు, భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మార్చి 1న రెండో దశలోకి అడుగుపెట్టింది. నిన్న(మార్చి 8,2021) అత్యధికంగా 20,19,723 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసింది కేంద్రం. మొత్తం మీద టీకాలు తీసుకున్నవారి సంఖ్య 2,30,08,733కి చేరింది.

తాజాగా నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం ఆరు రాష్ట్రాల నుంచే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మొన్న 11వేల 141 కేసులు నమోదవగా, తాజాగా 8వేల 744 మందికి వైరస్‌ సోకడం ఆ రాష్ట్రంలో మహమ్మారి విజృంభణకు నిదర్శనం. దీంతో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలు చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.