Covid Deaths: భారత్‌లోనే కరోనా మరణాలు ఎక్కువన్న డబ్ల్యూ.హెచ్.ఓ: కొట్టిపారేసిన కేంద్రం

ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు భారత్ లోనే సంభవించాయని..కరోనా మరణాలపై భారత ప్రభుత్వం చూపించిన లెక్కలకు..వస్తావ పరిస్థితులకు పొంతన లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.

Covid Deaths: భారత్‌లోనే కరోనా మరణాలు ఎక్కువన్న డబ్ల్యూ.హెచ్.ఓ: కొట్టిపారేసిన కేంద్రం

Who

Covid Deaths: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. గత రెండేళ్లుగా మానవాళిని పట్టిపీడిస్తున్న మహమ్మారి..లక్షల మందిని బలి తీసుకుంది. కోట్ల మంది ప్రజలు కరోనా భారిన పడ్డారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంకా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో ఇప్పటి వరకు Covid – 19పై ప్రపంచ వ్యాప్తంగా అందిన లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ.హెచ్.ఓ ఓ నివేదిక రూపొందించింది. కరోనా కారణంగా అన్ని దేశాల్లో నమోదైన మరణాలు, కరోనా కేసుల వివరాలు సేకరిస్తూ..డబ్ల్యూ.హెచ్.ఓ ఈ నివేదిక రూపొందించింది. ఈక్రమంలో భారత్ లో కరోనా మరణాలపై డబ్ల్యూ.హెచ్.ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు భారత్ లోనే సంభవించాయని..కరోనా మరణాలపై భారత ప్రభుత్వం చూపించిన లెక్కలకు..వస్తావ పరిస్థితులకు పొంతన లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.

Also Read:Power Crisis: దేశవ్యాప్తంగా 1,100 రైళ్లు రద్దు.. మే 24వరకు ఇదే పరిస్థితి.. ఎందుకంటే?

జనవరి 2020 – డిసెంబర్ 2021 మధ్య భారత్ లో కరోనా భారిన పడి 5 లక్షల మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే వాస్తవానికి ఆ లెక్క 47 లక్షలు పైగానే ఉందంటూ డబ్ల్యూ.హెచ్.ఓ ఆరోపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా కారణంగా 60 లక్షల మంది మృతి చెందారని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్నా..వాస్తవానికి ఆ సంఖ్య కోటి 50 లక్షలకు పైగానే ఉంటుందని డబ్ల్యూ.హెచ్.ఓ నివేదించింది. అయితే డబ్ల్యూ.హెచ్.ఓ నివేదికపై ఇటు భారత్ సహా..మిగతా దేశాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా మరణాల లెక్కింపు విధానంలో డబ్ల్యూ.హెచ్.ఓ పాటించే పద్ధతులే తప్పుగా ఉన్నాయంటూ ఆయా దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Also Read:Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు: కరోనా ఆంక్షల నడుమ భక్తులకు అనుమతి

అయితే “భారత్ లోనే కరోనా మరణాలు ఎక్కువ” అంటూ డబ్ల్యూ.హెచ్.ఓ చేసిన ప్రకటనపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. “గణిత నమూనాల ఆధారంగా అధిక మరణాల లెక్కింపు అంచనా వేయడానికి WHO అనుసరించిన పద్దతిపై భారతదేశం స్థిరంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ లెక్కింపు మోడలింగ్ యొక్క ప్రక్రియ, పద్దతి మరియు ఫలితంపై గతంలోనూ భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, WHO విడుదల చేసింది. భారత్ వ్యక్తపరిచిన ఆందోళనలను తగినంతగా పరిష్కరించకుండానే WHO ఈ అదనపు మరణాల అంచనాలు వేసింది” అంటూ భారత జాతీయ వైద్య ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:Telangana Covid Cases Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..

భారతదేశంలో దశాబ్దాల నాటి ‘జననాలు & మరణాల నమోదు చట్టం, 1969’ ద్వారా జననాలు మరియు మరణాల నమోదు చట్టబద్ధంగా చాలా పటిష్టంగా ఉంటుంది. ఆర్‌జిఐ ఏటా విడుదల చేసే సివిల్ రిజిస్ట్రేషన్ డేటా మరియు నమూనా నమోదు డేటాను దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు, ”అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది.