Delhi Corona : గంటకు 3 కరోనా మరణాలు.. ఢిల్లీలో భయానక పరిస్థితులు

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం

Delhi Corona : గంటకు 3 కరోనా మరణాలు.. ఢిల్లీలో భయానక పరిస్థితులు

Corona Deaths

Delhi Corona : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం 1.5లక్షలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీటిలో దాదాపు సగం కేసులు, మరణాలు ఒక్క మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ ఛత్తీస్‌గఢ్‌, డిల్లీ తదితర ప్రాంతాలు ఉంటున్నాయి.

ఢిల్లీలో పెరుగుతున్న మరణాలు
దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే.. ఇక్కడ ఆదివారం(ఏప్రిల్ 11,2021) గంటకు రెండు మరణాల చొప్పున నమోదైతే.. సోమవారం(ఏప్రిల్ 12,2021) ఆ సంఖ్య గంటకు మూడుకు చేరింది. ఆదివారం 10వేల 774 కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 48గా ఉంది. ఇక సోమవారం 11వేల 491 కేసులు నిర్ధారణ కాగా.. మరణాల సంఖ్య 72కి పెరిగింది. మార్చి 12న ఇక్కడ కేవలం 2 మరణాలు మాత్రమే చోటుచేసుకోగా.. అప్పుడు మరణాల సంఖ్య 10,936గా ఉంది. ఏప్రిల్‌ 12 నాటికి ఆ సంఖ్య 11,355కి పెరిగింది.

భారీగా నమోదవుతున్న కేసులు..
వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఒక్క రోజులో ఇక్కడ 10వేలకుపైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది(2020) నవంబర్‌లో అత్యధికంగా 7,830 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది(2021) ఏప్రిల్‌ 9న 8,521 కేసులు నమోదయ్యాయి. ఇవే ఇప్పటి వరకూ అత్యధిక కేసులు. ఇప్పుడు ఆ సంఖ్య కూడా దాటి పది వేలకుపైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 7.36 లక్షలు దాటింది.