బతకటానికి బెడ్ కోసం ఆరాటం..చనిపోతే మృతదేహం కోసం పోరాటం : కరోనా కాలంలో..ఆస్పత్రుల తీరు

బతకటానికి బెడ్ కోసం ఆరాటం..చనిపోతే మృతదేహం కోసం పోరాటం : కరోనా కాలంలో..ఆస్పత్రుల తీరు

Brother Search For Sister Dead Body In Delhi

Brother search for sister dead body in Delhi : ఈ కరోనా కాలంలో జరిగే దారుణాలు వినటానికే భయానకంగా ఉన్నాయి. కరోనా సోకినవారు బతకటానికి హాస్పిటల్ కు వెళితే అక్కడ బెడ్లు ఉండవు. ఏ ఆసుపత్రికి వెళ్లినా అదే పరిస్థితి ఉంది ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో. అలాగే ఎలాగోలా కాళ్లా వేళ్లా పడి రోజులు తరబడి ఆసుపత్రి ముందు పడిగాపులు పడి..ఓ బెడ్ దక్కించుకుంటే చాలు ఏదో ప్రపంచాన్ని జయించేసినంత ఫీలింగ్ కలుగుతోంది. ఇక మనం బతికేశాం..అనే భరోసా కలుగుతోంది. కానీ బతుకుకు భరోసా ఎక్కడ? ఎవరివ్వగలరు? ఆసుపత్రిలో బెడ్ దొరికినా..ఆక్సిజన్ అందక..ఊపిర ఆడక ప్రాణాలు పోతే..అదొక నరకం. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లకెళ్లాలంటే కూడా పోరాటమే చేయాల్సి వస్తోంది.

ఇలా ఉంది నేటి కాలంలో ఆసుపత్రుల తీరు. బతకటానికి బెడ్ కోసం ఆరాటం…దొరికినా..ఆక్సిజన్ అందకో లేదా మరేదైనా కారణాతోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే..ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించటానికి కూడా దిక్కులేదు. ఆ మృతదేహం కోసం వారి బంధువులు పోరాటమే చేయాల్సి వస్తోంది. దీనికి కారణం కొన్ని ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణమైతే..మరికొన్ని ఆస్పత్రుల కాసుల కక్కుర్తి కారణాలుగా మారుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో వెలుగుచూసిన ఇటువంటి ఘటన హృదయవిదారకంగా ఉంది. ఢిల్లీలోని ఈ ఆసుపత్రే కాదు పలు ఆసుపత్రుల్లలో ఇటువంటి పరిస్థులే ఎదురవుతున్నాయి.

దేశ‌రాజ‌ధానిలోని లోక్‌నాయక్ ఆసుపత్రిలో ఢిల్లీకి చెందిన సిద్ధార్థ కుమార్‌ త‌న సోద‌రి దీపిక‌ మృతదేహం కోసం నెల రోజులుగా ఆసుప‌త్రి చుట్టూ తిరుగుతున్నాడు. అయినా..ఫ‌లితం లేదు. మృతదేహం దొరకలేదు. దీంతో అతను ఓ పక్క సోదరి చనిపోయిందనే బాధ..మరోపక్క మృతదేహం కోసం పోరాటంతో కన్నీటితో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘ఎలాగైనా నా సోదరి మృతదేహాన్ని ఇప్పించండయ్యా..కనీసం దహన సంస్కారాలైన చేసుకుంటానని’’ కన్నీటితో వేడుకున్నాడు. కానీ అక్కడ కూడా అతనికి వేదనకు న్యాయం జరగలేదు. పోలీసులు ఇప్ప‌టికీ వరకూ ఆ దిశగా చర్యలే తీసుకోలేదు.

ఈ దారుణ పరిస్థితి గురించి తండ్రి సిద్ధార్థ కన్నీటితో మాట్లాడలేక మాట్లడలేన తన దుస్థితిని మీడియాకు మొరపెట్టుకోవటంతో ఈ విషయం బైటకొచ్చింది. ఏప్రిల్ 12 న నా సోద‌రి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.. వెంటనే ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాం. ఏప్రిల్ 15న ఆసుపత్రిలో కోవిడ్ టెస్ట్ చేయ‌గా..పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను కోవిడ్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్లు చెప్పారు.

అలా ఢిల్లీలో ఎన్నో ఆసుప‌త్రుల చుట్టూ తిరిగినా బెడ్లు దొర‌క‌లేద‌ు. కానీ ఎట్టకేలకు లోక్ నాయక్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయ‌గ‌లిగాం. అక్క‌డ‌ చికిత్స పొందుతూ నా సోదరి చనిపోయింది. కానీ ఇంతలో మా అమ్మానాన్నలిద్దరితో పాుట నా సోదరులు కరోనా బారిన పడ్డారు. దీంతో కుటుంబ స‌భ్యులెవ‌రూ లోక్ నాయ‌క్ ఆసుప‌త్రికి రాలేకపోయారు. ఈక్రమంలో నా సోదరి చనిపోయిందని ఆసుప‌త్రి సిబ్బంది ఫోను చేసి చెప్పారు. దీంతో..నేను వెంటనే ఆసుప‌త్రికి వచ్చాను. మార్చురీకి తరలించామని సిబ్బంది చెప్పగా..మార్చురీలో వెదికినా నా సోదరి మృత‌దేహం కనిపించలేదు. దీంతో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను సంప్ర‌దించాను. కానీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు.
నా సోదరి మృతదేహం ఎక్కడుంది? దయచేసి ఇప్పిండండీ అని ఆసుప్రతి సిబ్బందిని వేడుకున్నాను. దానికి వాళ్లు తాపీగ్గా..‘‘హా నీ సోదరి మృతదేహాన్ని ఎవరో తీసుకువెళ్లి ఉంటార్లే..అని చెప్పారని వాపోయాడు సిద్ధార్థ. అలా గత నెల రోజుల నుంచి సిద్ధార్థ సోదరి మృతదేహం కోసం వెదుకుతునే ఉన్నా ఫలితం లేకపోవటంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశానని కానీ వాళ్లు కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదని..నా సోదరిని ఆస్పత్రిలో చేర్చాక..కొన్ని రోజులే చూశాను..ఆఖరి చూపుకూడా దక్కుండా చేశారు..కనీసం ఆమెకు దహనసంస్కారాు చేసుకునే అవకాశం లేకుండా చేశారని సిద్ధార్థ కన్నీటితో చెప్పుకొచ్చాడు.