Teachers’ Day : కరోనా ఎఫెక్ట్..డిజిటల్ వేదికల్లోనే టీచర్స్ డే

టీచర్స్ డే చిన్నబోయింది. ఆన్ లైన్ లోనే టీచర్స్ డే జరుపుకోవాల్సిన పరిస్థితులకు కారణమైంది కరోనా మహమ్మారి.ఎంతోమంది ఉపాధ్యాయుల్ని వీధిన పడేసింది. విద్యార్ధులకు దూరం చేసింది.

Teachers’ Day : కరోనా ఎఫెక్ట్..డిజిటల్ వేదికల్లోనే టీచర్స్ డే

Corona Effect On Teachers' Day

Corona effect on Teachers’ Day : సెప్టెంబర్ 5… టీచర్స్ డే. ఈ కరోనా కాలంలో టీచర్స్ డే సందడే లేకుండాపోయింది. వచ్చిందంటే చాలు స్కూల్స్, కాలేజీలు,యూనివర్శిటీలు ఇలా విద్యాసంస్థలు జరుపుకుంటారు.కానీ కరోనా కారణంగా ఈ సారి ఆ హడావిడి కనిపించటం లేదు. కరోనా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతోంది. 2020లో కూడా టీచర్స్ డే సందడి లేకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది అయినా టీచర్స్ డే సందడి ఉంటుందనుకుంటే అటువంటిదేమీ లేకుండానే అయిపోయింది. సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదే టీచర్స్ డే సందర్భంగా చిన్నారులే టీచర్లు .. ఈసారి కనిపించని వేడుకలు టీచర్స్ డే వచ్చిందంటే చిన్నారులే టీచర్స్ గా అవతారం ఎత్తుతారు. బుడిబుడి అడుగుల బుడతడు బెత్తం పట్టుకొని టీచర్ లా ఫోజులు కొడుతు వచ్చీరాని మాటలతో పాఠాలు చెప్పేసేవాడు. బోలెడు పూలు తీసుకెళ్ళి తమకు ఇష్టమైన టీచర్లకు ఇచ్చేవారు విద్యార్ధులు. టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పేవారు.

స్కూల్స్ , కాలేజీలలో ఒక పండుగ దినం. ఒక వేడుకలా జరిగేది. అలాంటి వేడుక ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు స్కూల్స్, కాలీజీలు తెరవకపోవటంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని రోజుల క్రితం నుంచి అంటే నాలుగైదు రోజుల నుంచి విద్యార్ధులు స్కూళ్లకు వెళుతున్నారు. కానీ టీచర్స్ డే సందడి మాత్రం లేదు. టీచర్స్ డే 2020 నుంచి తొలిసారిగా ఆన్ లైన్ , సోషల్ మీడియాల వేదికల్లోనే జరిగిపోయింది.

1962నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ టీచర్స్ డే ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ ఈ సారి తొలిసారిగాఆన్ లైన్ లో , డిజిటల్ వేదికల మీద టీచర్స్ డే జరుగుతోంది. ఆన్ లైన్ లోనూ, సోషల్ మీడియాలోనూ విద్యార్ధులు టీచర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. విద్యార్ధులు టీచర్లను మిస్అవుతుంటే..టీచర్లు కూడా విద్యార్ధుల్ని మిస్ అవుతున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా 2020 నుంచి ఈ టీచర్స్ డే ఒకింత బాధాకరంగా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ కరోనా వచ్చాక ఎంతోమంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లు ఎంతోమంది వీధిన పడ్డారు. విద్యార్ధులకు దూరమైపోయారు.ఉపాధి కోల్పోయారు. టీచర్లు కూరగాయాలు అమ్ముకునే దుస్థితికి నెట్టివేయబడ్డారు.

అలాగే రోజువారీ కూలిలుగా మారుతున్న దుస్థితి. వీధి వీధి తిరిగి చీపుర్లు అమ్ముకుంటున్నారు. ఈ బాధలకంటే మాకు విద్యార్ధులకు దూరమయ్యామనే బాధే ఎక్కువగా ఉంటోందని చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు చెబుతున్నారు. విద్యార్ధులతో వారికి పెరిగిన అనుబంధం అటువంటిది.టీచర్లకు విద్యార్థులపై ఉన్న అవ్యాజమైన ప్రేమ, విద్యార్థులకు టీచర్లపై ఉన్న గౌరవం, భక్తి భావం ఎక్కడికీ పోవు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, తమ ఉన్నతికి కారణమైన టీచర్లను వృద్ధాప్యంలో కూడా గుర్తు చేసుకునే గొప్ప సంస్కృతి మనలో ఉంది. కాలేజీల్లో సరదగా లెక్చరర్స్ ను విద్యార్ధులు ఆట పట్టించినా అది సరదాగానే ఉంటుంది. దాంట్లో కూడా ఓ ఫన్..అంతే. అందుకే ఆన్లైన్ లో టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థి లోకమంతా చెబుతోంది గురుభ్యో నమః .