Omicron Mumbai : సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది.

Omicron Mumbai : సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

Mumbai (1)

Corona for a person from South Africa : లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది. అది గనుక ఇండియాలో వ్యాపిస్తే ఇబ్బందులు తప్పవనే భయాల నడుమ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. దీంతో సౌతాఫ్రికా సహా ఒమిక్రాన్ ఉధృతి ఉన్న దేశాల నుంచి వచ్చిన, వస్తోన్న ప్రయాణికులను వెతికిమరీ టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో బయటపడిన ఓ పాజిటివ్ కేసు అందరినీ కలవరపెడుతోంది. సౌతాఫ్రికా నుంచి ఇటీవలే తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. థానే జిల్లా డోంబివ్లి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తిని ప్రస్తుతం ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చిన వ్యక్తి ఈ నెల 24న ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడు. అక్కడి నుంచి మరో విమానంలో ముంబైకి వచ్చాడు. ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ సౌతాఫ్రికా నుంచే వ్యాపించినట్లు నిర్ధారణ కావడంతో ఆ దేశం నుంచి ప్రయాణాలు చేస్తోన్న, గత 14 రోజుల్లో ప్రయాణాలు చేసిన అందరినీ ప్రభుత్వాధికారులు విధిగా టెస్టులు చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఆ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరింట్ ఉన్నది లేనిదీ తెలుసుకునేందుకు అతని జీనోమ్ శాంపిళ్లను ల్యాబ్‌కు తరలించారు అధికారులు.

Lok Sabha : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభ ఆమోదం

ఇక ఒమిక్రాన్ భయాలతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కట్టడి చేయాలని సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వారం వ్యవధిలోనే 13 దేశాలకు వ్యాపించింది. డజనుకుపైగా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

ఇక అంతర్జాతీయ విమానాల రాకపోకలను వచ్చే నెల 15 నుంచి రాకపోకలను పునరుద్ధరించాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన తర్వాతే విమాన సర్వీసులను తిరిగి ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు, వారిపై నిఘాకు సంబంధించిన ఎస్‌వోపీ మార్గదర్శకాలపై కూడా నిర్ణయిస్తామన్నారు.

Omicron : ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్..159కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ‘ఎట్‌ రిస్క్‌’ జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని తెలిపింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్‌, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్‌కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్‌ హిస్టరీ సేకరించాలని సూచించింది.