Covid-19 : మహారాష్ట్ర, ముంబైలో కరోనా..పూణెలో ఆసుపత్రులు, బెడ్స్ ఫుల్,

మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Covid-19 : మహారాష్ట్ర, ముంబైలో కరోనా..పూణెలో ఆసుపత్రులు, బెడ్స్ ఫుల్,

Pune Corona

Maharashtra, Mumbai : మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితమే అత్యధికంగా 57వేల పాజిటివ్‌ కేసులు బయటపడగా.. మళ్లీ అదే రేంజ్‌లో కేసులు రికార్డయ్యాయి. ఒక్కరోజులోనే కరోనాతో 297 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 56 వేల 330కి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రతీరోజూ దాదాపుగా 50వేల కేసులు నమోదవుతున్నాయి.

అటు మహారాష్ట్ర రాజధాని ముంబైపై కరోనా దాడి కొనసాగుతోంది. మహానగరంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలోకి కరోనా ఎంట్రి ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనాతో మరో 30 మంది చనిపోయారు. 7 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవడంతో రికవరీ రేటు 81 శాతానికి చేరుకుంది. మరోవైపు కరోనా కట్టడి కోసం ముంబై నగరపాలక సంస్థ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు అక్కడి అధికారులు ఇప్పటివరకూ 740 భవనాలను సీల్ చేశారు. మురికి వాడల్లో 73 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

మహారాష్ట్రలోని ముంబైతో పాటు పూణె, నాగ్‌పూర్‌లలో మహమ్మారి విజృంభిస్తున్న తీరు బెంబేలెత్తిస్తోంది. పూణెలో పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు పూర్తిగా నిండిపోయాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. పుణేలో ఇప్పటికే కరోనా పేషెంట్లతో అన్ని ఆస్పత్రులు నిండిపోయాయి. దీంతో చాలా ఆస్పత్రుల్లో.. ఆరుబయటే కొంతమంది పేషెంట్లకు పడకలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. కొత్తగా వచ్చి చేరుతున్న పేషెంట్ల కోసం తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడుతోందంటే అక్కడి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

పింప్రిలోని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో వెయిటింగ్‌ ఏరియాలోనే బాధితులకు ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి సామర్థ్యం 400 పడకలు ఉండగా.. వీటిలో 55 ఐసీయూ పడకలు ఉన్నాయి. అయితే.. ఇవన్నీ ప్రస్తుతం కరోనా బాధితులతో నిండిపోయాయి. అయినా, తాకిడి మాత్రం తగ్గడం లేదు. బాధితుల పరిస్థితి అర్థం చేసుకొన్న వైద్యులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి వెయిటింగ్‌ ఏరియాలోనే ఆక్సిజన్‌ అందిస్తున్నారు. పూణె వ్యాప్తంగా కేవలం 79 మాత్రమే వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న పడకలు ఉన్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వెంటిలేటర్ల కొరత ఏర్పడడంపై ఆందోళన నెలకొంది.

Read More : India : 24 గంటల్లో..లక్షకు పైగా కరోనా కేసులు, 630 మంది మృతి