బీహార్‌లో లాక్ డౌన్ విధించిన సీఎం నితీష్ కుమార్

బీహార్‌లో లాక్ డౌన్ విధించిన సీఎం నితీష్ కుమార్

Bihar Lockdown

bihar lockdown : బీహార్‌లో పెరుగుతున్న కరోనా వినాశనం దృష్ట్యా, మే 15 వరకూ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ ప్రతిపాదనపై లాక్డౌన్ విధించాలని నిర్ణయించామని.. ఇందుకోసం వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎం పేర్కొన్నారు.

బీహార్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ వేగం హద్దు లేకుండా పోయింది. దీంతో ఆసుపత్రులలో పడకల కొరత, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరివర్తనను విచ్ఛిన్నం చేయడానికి లాక్డౌన్ పెట్టాలని బీహార్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాదు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారా లేదంటే మేమె నిర్ణయం తీసుకోవాలా? అని పాట్నా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 4 లోపు ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించకపోయినట్టయితే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది నితీష్ ప్రభుత్వం.