Corona Mock Drill : కరోనా కల్లోలం.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం, దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనుంది. కోవిడ్ 19 ఆరోగ్య సౌకర్యాల సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్..

Corona Mock Drill : కరోనా కల్లోలం.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం, దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

Corona Mock Drill : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో పరిస్థితి భయానకంగా ఉంది. అక్కడ కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.

మన దేశంలోనూ బీఎఫ్-7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై పోరాటానికి రెడీ అయ్యింది. ఇందులో భాగంగా రేపు (డిసెంబర్ 27) దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనుంది. రాష్ట్రాల ఆరోగ్య మంత్రి, చీఫ్ సెక్రెటరీ సహా ఆరోగ్య శాఖ అధికారులు కోవిడ్ మాక్ డ్రిల్ ను పర్యవేక్షించనున్నారు.

Also Read..Covid19: ఇండియాలో మళ్లీ లాక్‭డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ప్రపంచంలోని అనేక దేశాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలను గమనిస్తూ, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆరోగ్య కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ జరగనుంది. జిల్లాల వారీగా వైద్య అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించడానికి, కోవిడ్ 19 ఆరోగ్య సౌకర్యాల సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర ఆరోగ్యశాఖ. కోవిడ్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలను అమలు చేయడం అవసరమని కేంద్రం భావిస్తోంది.(Corona Mock Drill)

కోవిడ్ మాక్ డ్రిల్ సమయంలో దృష్టి సారించే అంశాలు..
* జిల్లాల్లో ఆరోగ్య సౌకర్యాల లభ్యత
* బెడ్ కెపాసిటీలు-ఐసోలేషన్ బెడ్‌లు, ఆక్సిజన్ సపోర్టెడ్ ఐసోలేషన్ బెడ్‌లు, ఐసియు బెడ్‌లు, వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్‌లు
* మానవ వనరుల సరైన లభ్యత
* వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, ఆయుష్ వైద్యులు, ఆశాస్, అంగన్‌వాడీ వర్కర్లతో సహా ఇతర ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు
* మానవ వనరుల సామర్థ్యం
* కోవిడ్-19పై శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు
* మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ నిపుణులు వెంటిలేటరీ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో శిక్షణ గల వారు, PSA ప్లాంట్ల ఆపరేషన్‌లో శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు

Also Read..Covid Tests In Airports : మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ.. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు

రెఫరల్ సేవలు..
* అధునాతన, ప్రాథమిక లైఫ్ సపోర్ట్ (ALS/BLS) అంబులెన్స్‌ల లభ్యత, ఇతర అంబులెన్స్‌ల లభ్యత, ఫంక్షనల్ అంబులెన్స్ కాల్ సెంటర్ లభ్యత

టెస్టింగ్ సామర్థ్యాలు..
* కోవిడ్ టెస్టింగ్ లేబొరేటరీల సంఖ్య, సామర్థ్యాలు
* RT-PCR , RAT కిట్ల లభ్యత, పరీక్షా పరికరాలు, రియాజెంట్ల లభ్యత

లాజిస్టిక్స్ లభ్యత..
అవసరమైన మందులు, వెంటిలేటర్లు, BIPAP, SPOz సిస్టమ్‌లు, PPE కిట్లు, N-95 మాస్క్‌లు

వైద్య ఆక్సిజన్..
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, PSA ప్లాంట్లు, ద్రవమెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టెలిమెడిసిన్ సేవల లభ్యత..
సంబంధిత జిల్లా కలెక్టర్లు/జిల్లా మేజిస్ట్రేట్ల మార్గ దర్శకత్వంలో, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో జరగనున్న మాక్ డ్రిల్

ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధత స్థితిని పర్యవేక్షించడానికి కోవిడ్ ఇండియా పోర్టల్ లో ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్న మాక్ డ్రిల్ ఫారమ్.

రేపు సాయంత్రం నాటికి అన్ని జిల్లాల్లో ఉన్న సౌకర్యాల వారీగా డేటాను అప్‌లోడ్ చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.