Oxygen Beds Full : కరోనా కల్లోలం, గుట్టలు గుట్టలుగా శవాలు..ఆక్సిజన్ బెడ్స్ ఫుల్

ఛత్తీస్‌గఢ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.

Oxygen Beds Full : కరోనా కల్లోలం, గుట్టలు గుట్టలుగా శవాలు..ఆక్సిజన్ బెడ్స్ ఫుల్

Oxygen Beds

Corona : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో రెండు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతతో 11మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురు మృతిచెందారు. వృద్ధురాలైన మహిళను ఓ ఆస్పత్రి డిశ్చార్జి చేయగా.. కుమారుడు మరోచోటకు తరలించే ప్రయత్నంలో చనిపోయింది. మహారాష్ట్ర సతారా జిల్లాలో కరోనా బారిన పడిన ఓ మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చినా పడకల్లేక.. ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఆటోకు తగిలించుకుని నిరీక్షించాల్సి వచ్చింది. ఉస్మానాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో రోగులను కుర్చీల్లో కూర్చోబెట్టి ఆక్సిజన్‌ అందిస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఇది దేశంలో వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే. మనకు తెలియనవి మరెన్నో ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు. రోజుకు 50 నుంచి 60 మంది చనిపోతుండటంతో సిబ్బందికి ఏం చేయాలో అర్థంకావడం లేదు. దీంతో స్ట్రెచర్లపై, మార్చురీ బయట.. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉంచుతున్నారు. కరోనాతో రాయ్‌పూర్‌లో 12 రోజుల్లోనే 861 మంది, దుర్గ్‌లో 213 మంది చనిపోయారు. 15 రోజుల క్రితం రాయ్‌పూర్‌లోని రెండు వాటికల్లోనే అంత్యక్రియలు జరిపేవారు. ఇప్పుడు పరిసరాల్లో ఉన్న 18 వాటికలనూ వినియోగిస్తున్నారు.

రాయ్‌పూర్‌లోని ఆసుపత్రులలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. పలు మృతదేహాలను స్టోర్‌ చేసే పరిస్థితులు లేక ఎండలో వాటిని ఉంచడాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. శవాలను భద్ర పరిచేందుకు అక్కడ అవసరమైన వసతులు లేవు. మృతదేహాలను ఉంచేందుకు సరిపడినన్ని ఫ్రీజర్ బాక్స్‌లు కూడా లేవు. కరోనాతో మరణించిన వారి కుటుంబీకులు మృతదేహాలను తీసుకుని వెళ్లడం లేదు. వారం రోజులుగా ఆసుపత్రిలోని ఆక్సిజన్ బెడ్లు 100 శాతం నిండిపోయి ఉన్నాయి. కొత్తగా ఆక్సిజన్ అవసరమైన వారికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారి ప్రాణాలు కూడా గాల్లో పెట్టిన దీపంలాగా మారిపోయాయి. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Read More :Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది