Corona update: కరోనా సోకిన భర్తను కాపాడుకోవటానికి నోటిలో నోరు పెట్టి శ్వాసనిచ్చిన భార్య..!!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రస్తుత కరోనా పరస్థితులకు..ఆక్సిజన్ అందని భయంకర పరిస్థితులకు అద్దం పడుతోంది ఓ భార్య భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించే ఘటన. శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా.. భర్త ప్రాణం నిలవకపోవడంతో.. ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది.

Corona update: కరోనా సోకిన భర్తను కాపాడుకోవటానికి నోటిలో నోరు పెట్టి శ్వాసనిచ్చిన భార్య..!!

Agra Corona Patient

Agra Corona Patient: భార్యా భర్తలు. కష్టంలోను సుఖంలోను కలిసి ఉంటామని పెళ్లిపీటల మీద చేసిన ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది ఈ భార్య. భర్తకు కరోనా వచ్చింది. భర్తను కాపాడుకోవటానికి హాస్పిటల్ లో చేర్పించింది. కానీ ఆక్సిజన్ కొరతతో ఆమె ఏం చేసిందో తెలుసా? కరోనా ఉందని తెలిస్తే కట్టుకున్నవాళ్లు, కన్నబిడ్డలు కూడా వదిలేస్తున్న ఈ కరోనా కాలంలో ఈ భార్య భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి ఎవ్వరూ చేయని సాహసం చేసింది. సాహసం అనే మాట పెద్దది అనుకోవచ్చు. కానీ కరోనా సోకి శ్వాస అందక అల్లాడిపోతున్న భర్తకు శ్వాస అందించటానికి భర్త నోటిలో నోరు పెట్టి శ్వాసనందించింది. అది సాహసం కాక మరేమిటి? అని అనుకోవాలి ఈ కరోనా రోజుల్లో..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రస్తుత కరోనా పరస్థితులకు..ఆక్సిజన్ అందని భయంకర పరిస్థితులకు అద్దం పడుతోంది ఓ భార్య భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించే ఘటన. శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా.. భర్త ప్రాణం నిలవకపోవడంతో.. ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది. కరోనా మహమ్మారిని కడుపు మంటతో శపించింది.
శుక్రవారం ( ఏప్రిల్ 23,2021) జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధంచిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆగ్రాలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ సెక్టార్ -7 నివాసి రవి సింఘాల్ అనే 47 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అతని భార్య రేణు సింఘాల్ బంధువులతో కలిసి ఆసుపత్రికి ఆటోలో బయలు దేరింది. ముందు రామా హాస్పిటల్ ఆ తర్వాత సాకేత్ హాస్పిటల్, కేజీ నర్సింగ్ హోమ్‌కు వెళ్లినా.. పడకలు అందుబాటులో లేక సింఘాల్‌ను చేర్చుకులేదు. చివరకు రేణు తన భర్తను తీసుకోని ఆటోలో ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి చేరుకుంది. ఈ క్రమంలో రవి సింఘాల్ శ్వాస అందక గిలగిలలాడిపోయాడు. దీంతో భార్య రేణుకు ఏం చేయాలతో తోచలేదు.

భర్తకు ఏమవుతుందోననే భయం..ఆందోళనతో అతడిని ఎలాగైనా కాపాడుకోవాలోననే తపనతో ఎవ్వరూ చేయని సాహసం చేసింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త నోటిలో నోరు పెట్టి శ్వాసం నందించింది. తన భర్తను కాపాడుకోవటానికి తనకు కరోనా సోకినా ఫరవాలేదు. తన ప్రాణాలు పోయినా ఫరవాలేదనుకుంది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా తన నోటితో భర్తకు శ్వాస అందించింది. ఎలాగైనా తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవాలని పదే పదే నోటితో శ్వాస అందించింది. కానీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు.