Ceiling Fan: కరోనాకి కాదు సీలింగ్ ఫ్యాన్ చూసి భయపడుతున్న పేషెంట్లు

కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ.. దానికి సంబందించిన ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి.. వీటిలో కొన్ని వీడియోలు మనుషులను కలచివేస్తుంటే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి.

Ceiling Fan: కరోనాకి కాదు సీలింగ్ ఫ్యాన్ చూసి భయపడుతున్న పేషెంట్లు

Ceiling Fan

Ceiling Fan: కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ.. దానికి సంబందించిన ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి.. వీటిలో కొన్ని వీడియోలు మనుషులను కలచివేస్తుంటే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ కరోనా పేషెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి.. తనపై ఉన్న ఫ్యాన్ ను చూసి పయపడటం మనం ఈ వీడియోలో చూడొచ్చు.

మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో సీలింగ్ కి ఉన్న ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతుంది. అది ఎప్పుడు ఊడి మీదపడుతుందో అని ఆ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు భయపడుతున్నారు. ఆ ఫ్యాన్ కింద ఉన్న బెడ్ పై ఉన్న వ్యక్తి ఫ్యాన్ తిరిగే దృశ్యాలను తన ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కరోనా కంటే ఈ ఫ్యాన్ తమను భయపెడుతుందని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ విషయం పై అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని తెలిపాడు సదరు వ్యక్తి.. కాగా ఈ సంఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది.

ఇక ఈ వీడియోలో సదరు వ్యక్తి మాట్లాడుతూ “మిత్రులారా నేను చింద్వారాలో అతి పెద్ద ఆస్పత్రిలో చేరాను. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి” నా బెడ్‌కి పైన ఓ విదేశీ ఫ్యాన్ తిరుగుతోంది. దాన్ని చూస్తుంటే భయం వేస్తోంది. కరోనా వల్ల భయం లేదు… ఈ ఫ్యాన్ భయపెడుతోంది.. దయచేసి అధికారులు దీనిని మార్చాలని వేడుకున్నాడు.