Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఢిల్లీ, కేరళలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.

Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఢిల్లీ, కేరళలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

Corona Cases

Corona Cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఢిల్లీలో కొత్తగా 535 కరోనం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20 వేల 13 లక్షల 938కు చేరింది. వీటిలో 26 వేల 536 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 23.05 శాతానికి పెరిగింది.

Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు. వేరియంట్ తో భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోవడంతో నిబంధనలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు.

కాగా, ఇన్ ఫ్లూయెంజా సబ్ టైప్ హెచ్3ఎన్2 కారణంగా ఇన్ ఫ్లూయెంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. H3N2 వైరస్ సోకితే ముక్కు కారడం, నిరంతర దగ్గు మరియు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఇన్ ఫ్లుయెంజా కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.