Corona : 1700 మంది పోలీసులకు కరోనా

సోమవారం వరకు డిపార్ట్‌మెంట్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1000 ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 మందికి కరోనా సోకింది. దీంతో సమావేశాలు అన్నీ వర్చువల్గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Corona : 1700 మంది పోలీసులకు కరోనా

Police

Corona for 1700 policemen : భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనవరి1 నుంచి 12 లోపు ఢిల్లీలో సుమారు 1700 మంది పోలీసులకు వైరస్ కోసినట్లు ఢిల్లీ పోలీసు శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 80 వేల పోలీసు సిబ్బందిలో 1700 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

సోమవారం వరకు డిపార్ట్‌మెంట్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1000 ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో సమావేశాలు అన్నీ వర్చువల్గా నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా సోకిన వారు హోం క్వారెంటైన్‌లో ఉన్నారని, వారందరికీ స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపారు.

Minister Vemula : ‘కేసీఆర్ ను టచ్ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తాం’ : మంత్రి వేముల

తగ్గాక వారంతా విధుల్లో చేరుతారని వెల్లడించారు. అలాగే ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన వారికి బూస్టర్ డోస్‌లు వేయించినట్లు వెల్లడించారు.

మహారాష్ట్రలో కొత్తగా 46,723 కరోనా కేసులు, 32 మంది మరణించారు. ముంబైలో కొత్తగా 16,420 కరోనా కేసులు, ఏడుగురు మృతి చెందారు. ఢిల్లీలో కొత్తగా 27,561 కరోనా కేసులు, 40 మంది మృతి చెందారు. కర్ణాటకలో కొత్తగా 21,390 కరోనా కేసులు, 10 మంది మరణించారు. కేరళలో కొత్తగా 12,742 కరోనా కేసులు, 23 మంది మృతి చెందారు.