Corona : కర్ణాటకలో 215 మంది విద్యార్థులకు కరోనా.. బాధితులంతా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారే..!

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో కోవిడ్‌ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్‌.. కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది.

Corona : కర్ణాటకలో 215 మంది విద్యార్థులకు కరోనా.. బాధితులంతా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారే..!

Corona Karnataka

Corona for 215 students in Karnataka : కర్ణాటకలోని విద్యాసంస్థల్లో కోవిడ్‌ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్‌.. కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య తాజాగా 182కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వైరస్‌ బారిన పడినవారిలో చాలా మంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే కావడంతో వారందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని తెలిపారు.నవంబరు 17న కాలేజీలో ఫ్రెషర్స్‌ పార్టీ జరిగింది. ఈ వేడుకలతోనే వైరస్‌ వ్యాప్తి జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాలేజీలో మొత్తం 3వేల వరకు విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వైరస్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలోనూ కోవిడ్‌ విజృంభిస్తోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఇక్కడ ఏకంగా 182 మంది విద్యార్థులకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. గురువారం విద్యార్థులకు కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా 66మందికి పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం మరో 690 మందికి టెస్టులు చేశారు. వీరిలో 116మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో క్యాంపస్‌లో వైరస్‌ బారిన పడిన విద్యార్థుల సంఖ్య 182కు చేరింది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు తగ్గుతున్న సమయంలో… ధార్వాడ్‌ ఎస్‌డీఎం మెడికల్‌ కాలేజీలో విద్యార్థులు భారీ స్థాయిలో కోవిడ్‌ బారిన పడటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

Corona New Variant : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం..కాసేపట్లో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

బాధితుల్లో చాలా మందికి కోవిడ్‌ లక్షణాలే కనిపించలేదు. కొంతమందికి మాత్రమే మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉన్నాయి. వైరస్‌ బారినపడిన వారంతా రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారేనని వైద్యాధికారులు తెలిపారు. విద్యార్ధులు భారీగా వైరస్‌ బారినపడడంతో.. ధార్వాడ్ డిప్యుటీ కమిషనర్‌ నితేష్‌ పాటిల్‌, డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యశ్వంత్‌ …హాస్పిటల్‌లో పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులందరికీ కోవిడ్‌ టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 939 మంది శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. ఈ క్యాంపస్‌లో మొత్తం 3 వేల మంది ఉన్నారు. ఒకేసారి ఇంత ఎక్కువమందికి కరోనా సోకడంతో..జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ సోకినవారిని రెండు వారాలు క్వారంటైన్‌ చేయించారు. మిగతా విద్యార్థులు కరోనా భారినపడకుండా కఠినచర్యలు తీసుకుంటున్నారు.

ఈ నెల 17న మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లోని.. జరిగిన ఓ కల్చరల్‌ ప్రోగ్సామ్‌ సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. దీంతో వైరస్‌ ఎక్కువ మందికి వ్యాపించిందని అధికారులు తెలిపారు. దీంతో ఒకే చోట గుమిగూడవద్దని హెచ్చరికలు జారీచేశారు అధికారులు. భౌతిక దూరం పాటించాల్సిందేనని, మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. మరోవైపు బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో కోవిడ్‌ సోకిన విద్యార్థుల సంఖ్య 34కు చేరింది. మరికొంత మంది రిపోర్ట్‌ ఇవాళ రానున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కరోనాతో బాధపడుతున్న విద్యార్థులంతా 18 ఏళ్లలోపు వారే. బాధిత విద్యార్థులను హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ నగరాలకు తరలించి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు.