Covid-19: జైళ్లలో కరోనా కలకలం

కరోనా సెకండ్ వేవ్ భారత్ లో బీభత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

Covid-19: జైళ్లలో కరోనా కలకలం

Covid 19 (4)

Covid-19: కరోనా సెకండ్ వేవ్ భారత్ లో బీభత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇక ఇదిలా ఉంటే సాధారణంగా బయట ఉన్న ప్రజలకే కాకుండా జైల్లో ఉన్న ఖైదీలను కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటికే కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 100 మందికి పైగా జైలు ఖైదీలు మృతి చెందారు.

ఇక హర్యానాలోని కర్నాల్ జైల్లో 56 మంది కరోనా భారినపడినట్లు అధికారులు వెల్లడించారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న 100 మందికి పరీక్షలు చేయగా 56 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మరికొందరి రిపోర్ట్స్ రావలసి ఉండాలని అధికారులు తెలిపారు. ఇక ఒడిశాలోని మయూర్‌భంజ్‌ ఉడల సబ్‌-జైళ్లో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జైల్లో కరోనా సోకిన ఖైదీలను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారికి కావలసిన మెడిసిన్ అందుబాటులో ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా బుధవారం 3,62,720 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో 4,136 అంది మరణించారు. కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అధికంగా నమోదవుతున్నాయి.. ఈ రెండు రాష్ట్రాల్లో బుధవారం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.