కరోనా నుంచి కోలుకున్నట్లేనా.. భారత్‌లో భారీగా తగ్గిన కొత్త కేసులు

కరోనా నుంచి కోలుకున్నట్లేనా.. భారత్‌లో భారీగా తగ్గిన కొత్త కేసులు

corona recovery rate:కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ ఇండియా ఇప్పుడు కోలుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం.. సాధారణ పరిస్థితులు రావడంతో కాస్త ఉపశమనం పొందుతున్న ప్రజానికం.. కేసులు కూడా పదివేల దిగువకు రావడంతో ఊపిరి పీల్చుకుంటోంది. దేశంలో కరోనా మరణాలు కూడా 100 దిగువకు చేరాయి. రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోగా.. గడిచిన 24 గంటల్లో 94 మరణాలు సంభవిస్తున్నాయి.

దేశంలో కొత్తగా 8వేల 635 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాంతో ఇప్పటి వరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇన్ని తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా.. రికవరీ రేటు 97శాతానికి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 13వేల 423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటి నాలుగు లక్షల మంది మొత్తంగా కోలుకున్నార. ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది. దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు. మరోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలను కేంద్రం అత్యవసర వినియోగం కింద వైరస్ ముప్పు పొంచి ఉన్నవారికి అందిస్తోంది.