కరోనా పుణ్యమాని కుప్పకూలిన బ్యూటీ మార్కెట్!

కరోనా పుణ్యమాని మహిళల సౌందర్య సాధనాలన్నింటికీ డిమాండ్ బాగా తగ్గింది. ముఖ్యంగా, కరోనా ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయడంతో, లిప్‌స్టిక్‌లతో సహా మిగతా సౌందర్య సాధనాలను తయారు..

కరోనా పుణ్యమాని కుప్పకూలిన బ్యూటీ మార్కెట్!

Buty Market

beauty market : కరోనా పుణ్యమాని మహిళల సౌందర్య సాధనాలన్నింటికీ డిమాండ్ బాగా తగ్గింది. ముఖ్యంగా, కరోనా ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయడంతో, లిప్‌స్టిక్‌లతో సహా మిగతా సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు భారీగా ఆదాయాన్ని కోల్పోయాయి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ముంచెత్తుతుండడంతో బ్యూటీ పార్లర్లతో సహా మార్కెట్ కూలిపోయింది. అంతర్జాతీయ సంస్థలు వాటి ఉత్పత్తిని సగానికి తగ్గించాయి. దాంతో వీటిమీద ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.

కరోనా సంక్షోభం ఫలితంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు, అలాగే వివాహాలు, బహిరంగ కార్యక్రమాలపై ఆంక్షలు కారణంగా బ్యూటీ మార్కెట్ గందరగోళంలో పడింది. మార్కెట్లో లోరియల్, లాక్మే, ఎల్-ఎటియన్నే, మాబెలిన్, డియోర్, రెవ్లాన్ సహా రెండు వేలకు పైగా కంపెనీల నుండి వివిధ రకాల ఉత్పత్తులు ఉన్నాయి. అన్ని రకాల సౌందర్య సాధనాలు విదేశాల నుండి వస్తాయి, కొన్ని భారతదేశంలో కూడా తయారవుతాయి.

అయితే మహిళలు మాస్కులు ధరిస్తున్న కారణంగా పేస్ క్రీములు, లిప్ స్టిక్ లు వాడటం దాదాపు మానేశారు.. దానికి తోడు బ్యూటీ పార్లలో కూడా ఆంక్షలు ఉండటంతో మహిళలు వెళ్లడం తగ్గించారు.. ఈ క్రమంలో సౌందర్య సాధనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.. కేవలం ఈ నెలలోనే అమ్మకాలు 70 శాతనికి పడిపోయాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్ కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని పలు బహుళజాతి మరియు అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. తద్వారా భవిషత్ లో నష్టాలు రాకుండా చూసుకుంటున్నాయి.