Corona Second Wave : ఆఫీసులు ఉండవా ? పర్మినెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ ? అయోమయంలో కంపెనీలు

ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానమేనా..? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ను ఉద్యోగులకు పరిచయం చేసిన కరోనా ఫస్ట్‌వేవ్‌.. ఇప్పుడు సెకండ్‌వేవ్‌ విజృంభణతో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది.

Corona Second Wave : ఆఫీసులు ఉండవా ? పర్మినెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ ? అయోమయంలో కంపెనీలు

Work From Home

Permanent work from home : ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానమేనా..? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ను ఉద్యోగులకు పరిచయం చేసిన కరోనా ఫస్ట్‌వేవ్‌.. ఇప్పుడు సెకండ్‌వేవ్‌ విజృంభణతో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాయి. గత డిసెంబర్‌ వరకు దాదాపు అన్ని కంపెనీలు దీని కొనసాగించాయి. కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపించడంతో కొన్ని కంపెనీలు ఆఫీస్‌ల నుంచి పని మొదలుపెట్టాయి. గత ఫిబ్రవరి నుంచి కరోనా ముందునాటి స్థితికి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కానీ అదే సమయంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. దీంతో కంపెనీలు మళ్లీ అయోమయంలో పడ్డాయి.

కరోనా ఫస్ట్‌వేవ్‌ మొదట్లో తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని మొదలుపెట్టిన కంపెనీలు.. ఇప్పుడు దాన్ని మరికొంత కాలం కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్‌వేవ్‌ పీక్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉండడంతో కంపెనీలు వెనకడుగు వేయల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగులు కూడా ఇంటి నుంచి పని చేయడంవైపే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కంపెనీలకు కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో వచ్చే నష్టాలేవి లేవు. క‌రోనా స‌మ‌యంలో వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ కార‌ణంగా కంపెనీల‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బు ఆదా అవ‌గా, అటు చాలా మంది త‌మ‌ ఉద్యోగాలు కోల్పోకుండా ఉన్నారు.

గతేడాది కరోనా కారణంగా ఉద్యోగులు కూడా పట్టణాలను వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ కొత్త కల్చర్‌ పుణ్యామాని రివర్స్‌ మైగ్రేషన్‌ మొదలైంది. కరోనా తగ్గుముఖం పట్టినట్లు అనిపించడంతో మళ్లీ పట్టణాల బాట పట్టాలని చూశారు. అయితే కరోనా సెకండ్‌వేవ్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో మళ్లీ సొంతూళ్లలోనే ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీకి వెళ్లి రిస్క్‌ తెచ్చుకోవడం ఎందుకని ఫీల్‌ అవుతున్నారు. ఇక కంపెనీలు కూడా కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నే బెస్ట్‌ అని ఆలోచిస్తోంది. దీంతో మరికొంత కాలం ఫ్రమ్‌ హోమ్‌ విధానమే ఉండనుందని సమాచారం.