Corona Second Wave: పేషేంట్ చనిపోయాడని నర్స్ మీద దాడి చేసిన బంధువులు.. వీడియో వైరల్!

రోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఆసుపత్రులలో బెడ్ల కొరత, ఐసీయూలో ఆక్సిజన్ కొరత వేధిస్తుంటే.. చనిపోయిన వారి మృతదేహాలను ఆసుపత్రుల మార్చురీలు, శ్మశానాల వద్ద క్యూలో పెట్టడం సెకండ్ వేవ్ పరిస్థితిని కళ్ళకు కడుతుంది.

Corona Second Wave: పేషేంట్ చనిపోయాడని నర్స్ మీద దాడి చేసిన బంధువులు.. వీడియో వైరల్!

Corona Second Wave Relatives Attacked The Nurse That The Patient Was Dead Video Viral

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఆసుపత్రులలో బెడ్ల కొరత, ఐసీయూలో ఆక్సిజన్ కొరత వేధిస్తుంటే.. చనిపోయిన వారి మృతదేహాలను ఆసుపత్రుల మార్చురీలు, శ్మశానాల వద్ద క్యూలో పెట్టడం సెకండ్ వేవ్ పరిస్థితిని కళ్ళకు కడుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా వైద్యులు, వైద్య సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలాంటి వారి సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాగా కొన్ని చోట్ల వారి మీద కూడా దాడులు చేయడం నీచ సంస్కృతికి అద్దం పడుతుంది.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పేషేంట్ మరణించాడని చెలరేగిన పుకారును నమ్మిన పేషేంట్ బంధువులు ఆసుపత్రి మీద దాడి చేశారు. అడ్డొచ్చిన నర్సు మీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆగ్రా జిల్లాలోని లోట‌స్ ఆస్ప‌త్రిలో చోటు చేసుకుంది. హ‌రిపార్వ‌త్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇర్ఫాన్ అనే వ్య‌క్తి అనారోగ్యానికి గురికావ‌డంతో లోట‌స్ ఆస్ప‌త్రిలో చేరాడు. ఆయనకు చికిత్స జరుగుతుండగానే అత‌ను చ‌నిపోయాడంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆసుపత్రి మీద కోపం పెంచుకున్న ఇర్ఫాన్ బంధువులు దాడికి దిగారు.

ఇర్ఫాన్ చనిపోయాడనే పుకార్ల‌ను న‌మ్మిన బంధువులు ఆస్ప‌త్రిపై ఇనుప‌రాడ్ల‌తో దాడి చేసి అద్దాల‌ను ధ్వంసం చేశారు. వారికి స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసిన న‌ర్సు మీద దాడికి దిగారు. టేబుల్ ఫ్యాన్‌, హెల్మెట్‌తో నర్సు మీద దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ త‌ప్పి కింద‌ప‌డిపోగా ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్లిపోయారు. కానీ ఇర్ఫాన్ కు ఎలాంటి ప్రాణహాని లేకపోగా చికిత్స పొందుతున్నాడు. దాడిపై ఆస్ప‌త్రి సిబ్బంది ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి దాడికి పాల్పడిన న‌లుగురిని అరెస్టు చేశారు. కాగా, దాడి సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

Read: Viral Video: పక్షిలా రెక్కల్లేవు కానీ గాల్లో ప్రయాణించిన యువకుడు.. ఎలా సాధ్యమైందంటే?