Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ ఇండియాలోనే తక్కువ.. అదే కారణమా

వదల బొమ్మాలి అంటూ కరోనా మళ్లీ వచ్చేసింది. కొత్త వేరియంట్లతో టెన్షన్‌ పెడుతూ చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరించింది. దేశంలో తొలిసారి 50 వేలకు పైగా నమోదైన కేసులు.. మరి ఇప్పుడు ఈ మహమ్మారిని కట్టడి చేయడం ఎలా..?

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ ఇండియాలోనే తక్కువ.. అదే కారణమా

Corona Second Wave

Corona Second Wave: వదల బొమ్మాలి అంటూ కరోనా మళ్లీ వచ్చేసింది. కొత్త వేరియంట్లతో టెన్షన్‌ పెడుతూ చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరించింది. దేశంలో తొలిసారి 50 వేలకు పైగా నమోదైన కేసులు.. మరి ఇప్పుడు ఈ మహమ్మారిని కట్టడి చేయడం ఎలా..? సర్వేలు.. వాటి నివేదికలు ఏం చెబుతున్నాయి..?

సెకండ్‌ వేవ్‌లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. చాల నెలల తర్వాత దేశంలో తొలిసారి 24 గంటల్లో 53వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 251 మంది కరోనాతో చనిపోయారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే మొదటిసారి.

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం వందరోజులుంటుందని ఎస్‌బీఐ రిపోర్టు చెబుతోంది.. ఫిబ్రవరి 15న దేశంలో కరోనా రెండో దశ ప్రారంభమైందని.. ఏప్రిల్ రెండో వారం ముగిసే సరికి… కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుతుందని… ఇప్పటికే వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

తొలి దశలో ఆరేడు నెలల కాలంలో నమోదైన కేసులు… రెండో దశలో రెండు నెలల్లోనే పెరుగుతాయని ఎస్‌బీఐ రిపోర్టు చెబుతోంది.. సెకండ్‌ వేవ్‌లో భారత్ వ్యాప్తంగా 25లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

సెకండ్ వేవ్ తీవ్రతలో మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో అంత ఎక్కువగా లేదు. వ్యాక్సినేషన్ కొనసాగుతుండటమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచితే… ఈ మహమ్మారిని అదుపు చేయచ్చంటోంది ఎస్‌బీఐ నివేదిక.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృస్టిస్తోంది. వారం పది రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజుకు వెయ్యి మంది చనిపోయే అవకాశం ఉందంటూ సంచలన ప్రకటన చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల పెరుగుదల అంతకంతకూ పెరుగుతోంది.. ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 758 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి.. ఈ మధ్య కాలంలో ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు.

ఇక దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చేందుకే తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అన్ని ప్రధాన ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

సెకండ్‌ వేవ్‌లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. చాల నెలల తర్వాత దేశంలో తొలిసారి 24 గంటల్లో 53వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 251 మంది కరోనాతో చనిపోయారు. ఈ ఏడాది… రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే మొదటిసారి.

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం వంద రోజులుంటుందని ఎస్‌బీఐ రిపోర్టు చెబుతోంది. ఫిబ్రవరి 15న దేశంలో కరోనా రెండో దశ ప్రారంభమైందని.. ఏప్రిల్ రెండో వారం ముగిసే సరికి… కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుతుందని… ఇప్పటికే వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

తొలి దశలో ఆరేడు నెలల కాలంలో నమోదైన కేసులు… రెండో దశలో రెండు నెలల్లోనే పెరుగుతాయని ఎస్‌బీఐ నివేదిక చెబుతోంది.. సెకండ్‌ వేవ్‌లో భారత్ వ్యాప్తంగా 25లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

సెకండ్ వేవ్ తీవ్రతలో మిగిలిన దేశాలతో పోలిస్తే…భారత్‌లో అంత ఎక్కువగా లేదు. వ్యాక్సినేషన్ కొనసాగుతుండడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచితే… ఈ మహమ్మారిని అదుపు చేయవచ్చోంటోంది ఎస్‌బీఐ నివేదిక.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృస్టిస్తోంది.. వారం పది రోజుల్లో అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజుకు వెయ్యి మంది చనిపోయే అవకాశం ఉందంటూ సంచలన ప్రకటన చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల పెరుగుదల అంతకంతకూ పెరుగుతోంది.. ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 758 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి.. ఈ మధ్య కాలంలో ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు.

ఇక దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చేందుకే ఎస్‌ఐఐ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అన్ని ప్రధాన ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించినట్లు తెలుస్తోంది.