కరోనా షట్ డౌన్ : తెలంగాణాతో సహా..పలు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు సమస్తం బంద్

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 11:41 AM IST
కరోనా షట్ డౌన్ : తెలంగాణాతో సహా..పలు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు సమస్తం బంద్

భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, అంగన్ వాడీ స్కూళ్లు, థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా నాలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

తెలంగాణ, ఛత్తీస్ గడ్, గోవా, పశ్చిమ బెంగాల్ ఆంక్షలకు సంబంధించిన దానిపై నిర్ణయాలు తీసుకున్నాయి. జనసమ్మర్థంగా లేకుండా చూడాలని ఆంక్షలు విధిస్తున్నాయి. జనాలు ఎక్కువగా ఉండే..ప్రాంతాల్లో ఉండే వాటిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపు కాకపోతే..గడువును మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

చైనాలో మరణాలు ఆగడం లేదు. యూరప్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 5423 మంది కరోనాతో మృతి చెందారు. భారత్‌లో రెండు కరోనా మృతులుగా రికార్డయ్యాయి. ఢిల్లీలో ఓ వృద్దురాలు కరోనాతో మృతి చెందారు. సౌదీలోకి రెండు వారాల పాటు అంతర్జాతీయ విమానాలకు నో ఎంట్రీ. 

See Also | కారెక్కి షో చేసి..హీరో అనుకుంటే ఎలా ? రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో : –
తెలంగాణ రాష్ట్రంలో 2020, మార్చి 31 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా హాల్స్‌ను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే..ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్, టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. శాసనసభా సమావేశాలు కూడా కుదించారని సమాచారం. 

* గోవాలో మార్చి 31 వరకు విద్యా సంస్థలు, బార్లు, పబ్బులు మూసివేత. 
* పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్. 
* మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలకు కేరళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

* మార్చి 31 వరకు విద్యా సంస్థలు, థియేటర్లు మూసివేయాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు. 
* కర్నాటక రాష్ట్రంలో వారం పాటు మాల్స్, థియేటర్స్, పబ్బులు, నైట్ క్లబ్బుల మూసివేత. 
* బీహార్‌లో మార్చి 31 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నితీష్ సర్కార్. 

* స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసిన ఛత్తీస్ గడ్ సర్కార్. 
* మార్చి 22 వరకు స్కూళ్లు, కళాశాలలను మూసి వేసిన యూపీ సర్కార్. 
* మార్చి 31 వరకు జమ్మూ కాశ్మీర్‌లో విద్యా సంస్థల మూసివేత. 

* రాజస్థాన్ రాష్ట్రంలో విద్యాసంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
* బెంగళూరులో వారం పాటు మాల్స్, థియేటర్లు బంద్ చేయనున్నారు. 
* హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 31 వరకు విద్యా సంస్థలు బంద్. 

* గోవా రాష్ట్రంలో విద్యా సంస్థలు బంద్ చేయనున్నారు. అయితే..షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగనున్నాయి. 
* మార్చి 31 వరకు అన్ని టోర్నీలు రద్దు చేసిన ముంబై క్రికేట్ అసోసియేషన్. 
* భారత్‌లోని అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేసిన అమెరికా. 

Read More : కరోనా వైరస్‌పై కీలక నిర్ణయం : మార్చి 31 వరకు హైదరాబాద్ షట్ డౌన్