మెడికల్ సర్టిఫికేట్ కిరికిరి : ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ స్టూడెంట్స్

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 08:48 AM IST
మెడికల్ సర్టిఫికేట్ కిరికిరి : ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ స్టూడెంట్స్

తెలంగాణ విద్యార్థులు ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకపోయారు. వీరితో పాటు కేరళ, బెంగళూరు, నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 

కరోనా విజృంభిస్తుండటంతో ఇటలీకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఉంటున్న తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటలీలో ఎంఎస్‌ చదువుతున్న, చదువు పూర్తయిన 16 మంది తెలంగాణ విద్యార్థులు స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తుండగా ఆ దేశం నిరాకరిస్తోంది. కోవిడ్‌ భయంతో వారిని రోమ్‌  జెనోవా రోమ్‌ ఫిమిసినో విమానాశ్రయంలో అధికారులు నిలిపివేశారు.

కరోనా వైరస్ కారణంగా ఇటలీ, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత దేశానికి రప్పించడంపై దృష్టి సారించామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటలీలో చిక్కుకున్న భారతీయులకు పరీక్షలు నిర్వహించేందుకు వైద్యబృందం 2020, మార్చి 13వ తేదీ శుక్రవారం బయల్దేరుతుందని తెలిపింది. ఇటలీ, ఇరాన్‌లలో చిక్కుకున్న భారతీయులకు తగిన పరీక్షలు, స్క్రీనింగ్ చేసిన తర్వాత తిరిగి భారత దేశానికి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ రెండు దేశాల్లో కరోనా వైరస్ పరిస్థితి తీవ్రంగా ఉందని… ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్పష్టం చేసింది.(ఖమ్మంలో మెడిసిన్‌ విద్యార్థికి కరోనా లక్షణాలు)

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్‌ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి చేరింది. ఇందులో 56మంది భారతీయులుండగా.. 17మంది విదేశీయులున్నారు. దీంతో  కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే ఏప్రిల్‌ 15 వరకు టూరిస్టు వీసాలను రద్దు చేసిన ప్రభుత్వం… తాజాగా హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించింది.

Read More : భార‌త్‌లో కరోనా : పెరుగుతున్న కేసులు..వీసాలు రద్దు..హెల్ప్ లైన్ నెంబర్