కరోనా టెస్టులు..భారీ తేడాలు : False పాజిటివ్, False నెగటివ్

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 02:22 AM IST
కరోనా టెస్టులు..భారీ తేడాలు : False పాజిటివ్, False నెగటివ్

కరోనా టెస్టుల్లో భారీగా తేడాలు వస్తున్నాయి. ఒకసారి పాజిటివ్ అని..మరోసారి నెగటివ్ వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్‌లలో ఈ విధమైన పరిస్థితి నెలకొంది. నోయిడాలో 19 మంది కరోనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యారు. అక్కడ పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చింది. దీంతో వీరందరినీ డిశ్చార్జ్ చేశారు. ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినా..పరీక్షల్లో బయటపడకపోవడం..నెగటివ్ వచ్చింది కదాని హాయిగా తిరిగేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి మరికొందరికి సంక్రమించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఇలా 15 శాతం మందికి ఫాల్స్ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. 

కరోనా కారణంగా ఎన్నో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోపుతోంది. మహారాష్ట్ర ప్రైవేటు ల్యాబ్స్‌లో ఫాల్స్‌ పాజిటివ్‌ వస్తూ ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువై పోతున్నాయి. దీంతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నిజమైన రోగులకు చికిత్స ఆలస్యం అవుతోంది. ఫాల్స్‌ నెగిటివ్‌ సమాజానికి అత్యంత ప్రమాదకరమంటున్నారు నిపుణులు.

ప్రపంచదేశాల్లో సగటున 29% వరకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని, వారిలో వైరస్‌ ఉంటుంది కానీ లేదని నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌ చేయరు. దీంతో వీరి ద్వారా ఇతరులకు వ్యాధి సోకుతోంది. పరీక్షలు చేసినప్పుడు ల్యాబ్‌ టెక్నీషియన్లు అప్రమత్తంగా లేకపోయినా, వారిలో నైపుణ్యం కొరవడినా ఫలితాలు తప్పుగా వెలువడే అవకాశాలున్నాయి.  వ్యాధి లేని వారు కూడా ఆస్పత్రిలో చేరడం వారికి కూడా ప్రమాదమేనంటున్నారు. 

Read: ముస్లిం పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేయొద్దంటోన్న డాక్టర్ మెసేజ్ వైరల్