No Holi : హోలీ సంబరాలు వద్దు, ఈ రాష్ట్రాల్లో నిషేధం

హోలీ సంబరాలపై కరోనా ఎఫెక్ట్ మరోసారి పడింది. భారత్‌లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.

No Holi : హోలీ సంబరాలు వద్దు, ఈ రాష్ట్రాల్లో నిషేధం

Holi corona

Corona Time : హోలీ సంబరాలపై కరోనా ఎఫెక్ట్ మరోసారి పడింది. భారత్‌లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో.. రాష్ట్రాల ప్రభుత్వాలకు టెన్షన్ పట్టుకుంది. హోలీ రోజున జనం పెద్ద ఎత్తున గుమికూడే అవకాశం ఉఁది. రంగు నీళ్లు చల్లుకుంటారు. ఆ నీటిలో, గాలిలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో.. హోలీ వేడుకలను కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తున్నాయి.

సీనియర్ సిటిజన్లు, అనారోగ్యంతో ఉన్న వారు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మధ్యప్రదేశ్, బీహార్‌ ప్రభుత్వాలు హోలీ వేడుకలపై గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై నిషేధం ఉంది. అటు మహారాష్ట్ర కూడా ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో హోలీపై ఆంక్షలు విధించింది. ఢిల్లీతో పాటూ… పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్‍‌లో హోలీ వేడుకలపై బ్యాన్ ఉంది. ఇటు తెలంగాణలోనూ హోలీ పండగపై కరోనా ఎఫెక్ట్ పడింది. హోలీ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ ఈవెంట్లకు అనుమతి లేదని చెప్పారు. కోవిడ్‌ కేసులు విజృంభించడంతో ఆంక్షలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు..సెకండ్ వేవ్‌లో కరోనా చెడుగుడు ఆడుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 62 వేల కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ 16 తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో కొత్తగా 62వేల 258 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మొత్తం 291 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల 52 వేల 647కు చేరుకుంది.
కరోనా రికవరీ రేటు 95 శాతం కంటే ఎక్కువగానే ఉన్నా… కొత్త కేసులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 160 రోజుల తర్వాత తొలిసారిగా భారీ స్థాయిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో ప్రస్తుతం భారత్ మూడో స్థాయిలో ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక , కేరళ, ఢిల్లీలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.
Read More : Yuvraj Hairstyle : యువరాజ్ కిర్రాక్ లుక్‌, ఫ్యాన్స్ ఫిదా