Corona Vaccine : 5-12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. నిర్ణయంపై ఉత్కంఠ

6 నుంచి 12 ఏళ్ల వయస్సున్న వారి కోసం భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, 5-12 ఏళ్ల వారి కోసం బయోలాజికల్ -ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాకు అనుమతులు ఇచ్చింది...

Corona Vaccine : 5-12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. నిర్ణయంపై ఉత్కంఠ

Vaccine

Corona Vaccine For Children : కరోనా మళ్లీ భయపెడుతోంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కేసులు అధికమౌతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ నిబంధనలు తీసుకొస్తున్నాయి. మాస్క్ కంపల్సరీ ధరించాలని లేనిపక్షంలో జరిమాన విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయి.. రాష్ట్రాలకు పలు సూచనలు, సలహాలు చేస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా ఫోకస్ చేసింది. మరింత వేగంగా వ్యాక్సినేషన్ పంపిణీ జరగాలని ఆదేశించింది. కానీ.. ఇప్పటి వరకు 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా పంపిణీ జరగలేదు.

Read More : AP Corona Latest News : ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

దీనిపై ఓ నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఆ వయస్సు ఉన్న వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా వెల్లడించారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) శుక్రవారం నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు టీకాలకు డీసీజీఐ (DCGI) అత్యవసర అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read More : Corona in IIT Madras: నాలుగో దశలో చాపకింద నీరులా కరోనా విస్తరణ: ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో 111 యాక్టివ్ కేసులు

6 నుంచి 12 ఏళ్ల వయస్సున్న వారి కోసం భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, 5-12 ఏళ్ల వారి కోసం బయోలాజికల్ -ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాకు అనుమతులు ఇచ్చింది. ఈ వయస్సు గ్రూప్ పిల్లలకు టీకా పంపిణీ త్వరలోనే ప్రారంభించే అవకాశాలున్నాయి. మరోవైపు.. కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో పాఠశాలలు, విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. విద్యార్థులు స్కూళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో.. మళ్లీ కరోనా కేసులు పంజా విసురుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఈక్రమంలో.. 5-12 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ను అందించాలని కేంద్రం భావిస్తోంది. మరి.. శుక్రవారం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.