Corona Vaccine : రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ ఉచితం..

వ్యాక్సిన్ ధరలపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. తాము కొనుగోలు చేసిన వాటాను రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.

Corona Vaccine : రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ ఉచితం..

Corona Vaccine

Corona vaccine is free for states : కరోనా వ్యాక్సిన్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను రూ.150కే కొంటామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ధరలపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. తాము కొనుగోలు చేసిన వాటాను రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సంస్థల నుంచి కేంద్రం కొనుగోలు చేసే 50 శాతం డోసులు మాత్రమే ఉచితంగా అందుతాయి. రాష్ట్రాలు కొనుగోలు చేయాలంటే 400 చెల్లించాల్సిందే.

బుధవారం చేసిన ప్రకటనలో సీరం సంస్థ వ్యాక్సిన్ ధరలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400గా, ప్రైవేట్ హాస్పిటల్ కు రూ.600గా నిర్ణయించింది. దేశం కొత్త స్ట్రాటజీ ప్రకారం.. మే1 నుంచి 18ఏళ్లు పై బడ్డ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలి. సీరం ఇన్ స్టిట్యూట్ కొవీషీల్డ్ వ్యాక్సిన్ 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు మిగిలింది కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది.

కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ.. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారికి ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. రాష్ట్రాలు కావాలనుకుంటే ఉచితంగా ఇచ్చుకోవచ్చు. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సినేషన్‌ అంటే భారీ ఎత్తున ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కానీ, వాస్తవానికి ఆ ఖర్చంతా చూస్తే దేశ జీడిపీలో ఒక్క శాతం కూడా ఉండడం లేదు.

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంతం చేశాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యాక్సినేషన్ కోసం బారులు తీరుతున్నారు. ఇంతకముందు 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ కారణంగా వ్యాక్సినేషన్ డోసులు నిల్వలు త్వరగా అయిపోతున్నాయి.