Vaccine Stocks : దేశంలో భారీగా పేరుకుపోతున్న కరోనా టీకా నిల్వలు

కరోనా తగ్గుముఖం పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ..వైరస్ తీవ్రత తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు వేలకు వేలు వెచ్చించి టీకా వేయించుకుంటే..ఇప్పుడు ఉచితంగా అందిస్తామన్నా ఎవరూ ముందుకురావడం లేదు.

Vaccine Stocks : దేశంలో భారీగా పేరుకుపోతున్న కరోనా టీకా నిల్వలు

Vaccine Stock

Corona vaccine stocks : కరోనా టీకాలు మురిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకునేవాళ్లు లేకపోవడంతో దేశంలో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. కరోనా టీకాల కోసం తనపై ఒత్తిడి పెరుగుతోందని, తనకు ప్రాణహాని ఉందని ఒకప్పుడు లండన్ వెళ్లి తలదాచుకున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా ఇప్పుడు తమ కంపెనీ తయారు చేసిన 20కోట్ల కోవీషీల్డ్ టీకాలు ఆగస్టు సెప్టెంబరు నాటికి మురిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. దావోస్‌లో గత నెలలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయనే స్వయంగా ఈ విషయం చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజుల్లో సెకండ్ వేవ్ నుంచి దేశం క్రమంగా కోలుకుంటోంది. రెండో వేవ్ సృష్టించిన భీతావహ పరిస్థితులతో కరోనా టీకాల కోసం జనం ఎగబడ్డారు. కానీ దేశంలో ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి.

కొత్తగా టీకా వేయించుకునేవాళ్లకే కాదు….అప్పటికి తొలి డోస్ పూర్తిచేసుకున్న వాళ్లు కూడా రెండో డోస్ కోసం అష్టకష్టాలు పడ్డారు. వ్యాక్సినేషన్ కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. అప్పటికి దేశంలో అందుబాటులోకొచ్చిన కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేక సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ చేతులెత్తేయాల్సిన పరిస్థితి. రష్యా స్పుత్నిక్ వి టీకాకు అనుమతిచ్చినా దేశంలో పూర్తిస్థాయిలో పంపిణీ మొదలు కాలేదు. కొన్ని టీకా ఉత్పత్తి సంస్థలకు అడ్వాన్స్ ఇచ్చిమరీ కేంద్రం డోస్‌లు బుక్‌చేసుకుందంటే ఆ సమయంలో దేశంలో టీకా కొరత ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో కూడా పరిస్థతి ఇలానే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు మొదలుకుని, పేద దేశాలు దాకా అన్నీ టీకా కొరతతో అల్లాడాయి. కానీ ఏడాదంటే ఏడాది కాలంలో పరిస్థితి మొత్తం మారిపోయింది.

Corona Vaccine: భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్.. సింగిల్-డోస్‌ చాలు

కరోనా తగ్గుముఖం పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ..వైరస్ తీవ్రత తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు వేలకు వేలు వెచ్చించి టీకా వేయించుకుంటే..ఇప్పుడు ఉచితంగా అందిస్తామన్నా ఎవరూ ముందుకురావడం లేదు. ఏడాది క్రితం ఫైజర్ వంటి టీకాల కోసం దుబాయ్, ఇతర దేశాలకు వెళ్లి టీకా వేయించుకున్న భారత సంపన్న వర్గం కూడా ఇప్పుడు వ్యాక్సిన్ల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక బూస్టర్ డోస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. థర్డ్‌ వేవ్ సమయంలో బూస్టర్ డోస్ గురించి ప్రచారం దేశంలో మూడో డోస్ తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. బూస్టర్‌ డోస్‌గా ఏ టీకా తీసుకోవాలో తెలియని గందరగోళంతో పాటు థర్డ్‌ వేవ్‌లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా లేకపోవడం, మూడో వేవ్ ఎక్కువ రోజులు లేకపోవడంతో ఎవరూ వ్యాక్సిన్ల గురించి పట్టించుకోవడం లేదు.

ఇక టీకా తీసుకున్నవారిలో కొందరికి దుష్పరిణామాలు తలెత్తడం, ఎలాంటి అనారోగ్యం లేకపోయినా హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం వంటివన్నీ వ్యాక్సిన్ విపరిణామాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా వ్యాక్సిన్ పంపిణీపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా దేశంలో టీకా నిల్వలు భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఒక్క డోస్‌ కూడా దొరకని స్థితి నుంచి ఇప్పుడు టీకాలు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. టీకా ఎక్స్‌పైరీ తేదీ తక్కువ వ్యవధిలో ఉండడం, డిమాండ్ అనూహ్యంగా పడిపోవడంతో వచ్చే మూడు-నాలుగు నెలల కాలంలో భారీ స్థాయిలో టీకాలు పనికిరాకుండా పోనున్నాయి.

Covid Vaccine: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. ఇండియాలో తొలిసారి

దీంతో టీకా కాలపరిమితి పెంచాలనుకున్నట్టు ఇప్పటికే వ్యాక్సిన్ సంస్థలు సంకేతాలిస్తున్నాయి. నిల్వలను తగ్గించుకునేందుకు భారత్ బయోటెక్ ప్రయివేట్ ఆస్పత్రులతో కలిసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. కాలపరిమితి తీరిపోయిన డోస్‌లను తొలగించి కొత్తవి పంపిణీ చేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే ఎన్నికోట్ల డోసుల కాలపరిమితి తీరబోతోందో భారత్ బయోటెక్ వెల్లడించలేదు. కోవాగ్జిన్ కాలపరిమితి 12 నెలలుగా ఉంది. దేశంలో 80శాతం ప్రజలు వేయించుకున్న కోవిషీల్డ్ టీకా కాలపరిమితి 9 నెలలుగా ఉంది. గత ఏడాది డిసెంబరులో ఉత్తప్తి చేసిన కోవీషీల్డ్ డోసులన్నీ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఎక్స్‌పైర్ అవుతాయి.

సీరమ్ డిసెంబరు నుంచి టీకా ఉత్పత్తి నిలిపివేసింది. ఇప్పుడా సంస్థ దగ్గర 200 నుంచి 250 మిలియన్ డోసుల టీకాలు ఉన్నాయని అంచనా. విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా నిల్వలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది.ఆయా కంపెనీల దగ్గరే కాదు..ముందుజాగ్రత్తగా టీకాలు కొనిపెట్టుకున్న రాష్ట్రాల దగ్గర కూడా వ్యాక్సిన్ నిల్వలు పేరుకుపోతున్నాయి. మహారాష్ట్రలో 34లక్షల కోవీషీల్డ్, 9వేల 895 కోవాగ్జిన్ డోసులకు ఆగస్టులో కాలపరిమితి తీరిపోనుంది. మహారాష్ట్రతో పాటు మిగిలిన రాష్ట్రాలు వేగంగా వ్యాక్సిన్ పంపిణీపై దృష్టిపెట్టాయి. అటు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ భారీ సంఖ్యలో టీకాలు పేరుకుపోయాయి.