Big Relief: దేశంలో తగ్గిన కరోనా.. 11 రాష్ట్రాల్లో కొత్త కేసులు 300 కన్నా తక్కువే!

దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

Big Relief: దేశంలో తగ్గిన కరోనా.. 11 రాష్ట్రాల్లో కొత్త కేసులు 300 కన్నా తక్కువే!

Corona Virus Cases Continue To Decline Know 5 Relief Things For The Country

Corona Virus decline: దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో రోజూవారీ కరోనా సోకిన వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరువగా ఉండగా.. వైరస్ వ్యాప్తి ఇప్పుడు చాలా తగ్గింది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మిజోరం సహా 11 రాష్ట్రాల్లో కేసులు 300కంటే తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. కొత్త కరోనా కేసులలో గరిష్ట క్షీణత నమోదైంది. ఈ క్షీణత దృష్ట్యా, ఇప్పుడు రాష్ట్రాల్లో కరోనా నిబంధనల్లో సడలింపులు జరుగుతున్నాయి. భారతదేశం కంటే బ్రెజిల్‌లోనే ఇప్పుడు ఎక్కువగా కొత్త కేసులు వస్తున్నాయి. భారతదేశం కంటే బ్రెజిల్‌లోనే ప్రతిరోజూ మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.

గత ఒక వారం నివేదికను చూస్తే.. భారతదేశంలో 4.26 లక్షల కొత్త కేసులు నమోదవగా.. ఈ కాలంలో బ్రెజిల్‌లో 5.13 లక్షల కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో, భారతదేశంలో సుమారు తొమ్మిది వేల మంది మరణించగా, బ్రెజిల్లో 14 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్.. ఏప్రిల్-మే నెలల్లో తీవ్ర కలకలం రేపింది. రోజువారీ కేసులు 50 వేల నుంచి 4 లక్షలకు పెరిగాయి. మళ్ళీ 4 లక్షల నుండి 50 వేలకు రావడానికి 43 రోజులు పట్టింది.

దేశంలో 77 శాతం (38,990) కరోనా కేసులు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో నమోదవుతూ ఉన్నాయి. మిగిలిన 33 శాతం కేసులు మిగిలిన రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఇప్పుడు దేశంలో ప్రతి 100 మందిలో ముగ్గురు మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఒక నెల క్రితం ఈ సంఖ్య 15గా ఉంది. అదే సమయంలో, దేశంలోని 90శాతం జిల్లాల్లో క్రియాశీల కేసులు నిరంతరం తగ్గుతున్నాయి. గతవారం, దేశంలోని 718 జిల్లాల్లో, 70 జిల్లాల్లో మాత్రమే క్రియాశీల కేసులు పెరిగాయి. వీటిలో కేవలం 27 జిల్లాల్లో 100కి పైగా క్రియాశీల కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53వేల 256 క‌రోనా కేసులు నమోదవగా.., ఇదే సమయంలో 1422 మరణాలు న‌మోద‌య్యాయి. గడిచిన 24గంటల్లో 78,190 మంది కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 7,02,887 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.