India Corona : దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. కంట్రోల్ చేయకపోతే థర్డ్ వేవ్ లో దారుణ పరిస్థితులు

దేశంలో చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

India Corona : దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. కంట్రోల్ చేయకపోతే థర్డ్ వేవ్ లో దారుణ పరిస్థితులు

India Corona

india Corona : దేశంలో చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందని హెచ్చరించింది. 10 రాష్ట్రాల్లో 46 జిల్లాలో 10 శాతానికిపైగా, 53 జిల్లాలో 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేట్ నమోదవుతున్నట్లు తెలిపింది. అయితే రాష్ట్రాల అలసత్వ కారణంగా గత వారం రోజులుగా రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. కంట్రోల్ చేయకపోతే బీభత్సం తప్పదని వార్నింగ్ ఇచ్చింది.

మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు కఠిన నిబంధనలు విధించాలని కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది. కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిస్థితిపై కేంద్రం సమీక్ష జరిపింది. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో పాజిటివిటి రేటు పది శాతం ఉందని గుర్తించింది. జిల్లా స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్రాలు స్థానికంగా జీరో సర్వే నిర్వహించాలన్నారు.

కోవిడ్ తో చనిపోతున్న వారిలో 80 శాతం మంది 45 ఏళ్లు పైబడిన వారే ఉంటున్నందున ఆ వర్గాలకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. అనవసర ప్రయాణాలు, ప్రజలు గుంపులుగా గుమికూడటాన్ని తక్షణం నియంత్రించాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర సూచింది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని చెప్పింది. రాష్ట్రాల్లో 46 జిల్లాల్లో అందరికీ టీకాలు అందేలా చూడాలని, దీని ద్వారా పాజిటివిటి రేటు తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం తీసుకోవాలని, టీకా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి ఆదేశాలిస్తే ఆ ప్లాంట్ల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో సమీక్షించి తక్షణం ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పింది. ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కేసుల మ్యాపింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ ఆధారంగా కంటైన్మెంట్ జోన్ లను అమలు చేయాలి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలను నిరంతరం పరిశీలిస్తుండాలి. ఐసీఎమ్ ఆర్ మార్గదర్శకాల ప్రకారం మరణాల లెక్కలను ప్రకటించాలని కోరింది. అంతర్జాతీయ ప్రయాణికులు నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించేందుకు ఇన్సాకాగ్ ల్యాబోరేటరీ నెట్ వర్క్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.