COVID-19 cases: 12వేలు దాటిన కొవిడ్-19 కేసులు.. 70వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.

COVID-19 cases: 12వేలు దాటిన కొవిడ్-19 కేసులు.. 70వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య

COVID-19 cases

COVID-19 cases: దేశం వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రోజువారి కొత్త కేసుల నమోదు సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం రోజువారి కొత్త కేసుల సంఖ్య 12వేలు దాటింది.  ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం రోజు) 12,193 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయం గణాంకాలతో పోల్చితే గడిచిన 24గంటల్లో 4శాతం ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 67,556 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

COVID-19 Cases: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు. తాజా మరణాలతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,300కు చేరింది. భారత్‌లో కొవిడ్ -19 కేసుల నమోదు సంఖ్య 4,48,81,877కు చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో కొవిడ్ – 19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకు కొవిడ్ వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 4,42,83,021కి పెరగగా, మరణాల రేటు 1.18శాతంగా నమోదైంది.

Covid-19 Cases: స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. 57వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. కొవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని, వైరస్ కట్టడి విషయంలో అలసత్వం వహించొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇదిలాఉంటే.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 220.66 కోట్ల మందికి టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.