Covid Cases In India: దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ.. క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. వారంరోజుల్లో మరణాలు ఎన్నంటే ..

కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైందా..? గత ఏడాది ప్రారంభం వరకు దేశాన్ని భయపెట్టిన కోవిడ్ మహమ్మారి.. ఆ తరువాత కొంచెం తగ్గుముఖం పట్టింది. గతేడాది చివరి నాటికి రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య వంద‌కు దిగువకు పడిపోయాయి.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 130 రోజుల తరువాత శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దీంతో వారం రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలకు చేరింది.

Covid Cases In India : కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైందా..? గత ఏడాది ప్రారంభం వరకు దేశాన్ని భయపెట్టిన కోవిడ్ మహమ్మారి.. ఆ తరువాత కొంచెం తగ్గుముఖం పట్టింది. గతేడాది చివరి నాటికి కోవిడ్ కేసుల సంఖ్య వందల సంఖ్యలోకి పడిపోయాయి.. ఈ ఏడాది గత నెలలోనూ కోవిడ్ కేసులు నామమాత్రంగానే నమోదయ్యాయి. అయితే, తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 130 రోజులు తరువాత శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఈ నెల ప్రారంభం నుంచి క్రమంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన వారం రోజుల్లో వీటి సంఖ్య భారీ పెరిగింది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతుండగా.. ఉత్తరాధిలో కూడా కోవిడ్ కేసులు పెరగడం ప్రారంభమైంది.

covid-19: ఒకేరోజు వెయ్యి దాటిన కోవిడ్ కేసులు.. నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి

శనివారం దేశంలో 1,071 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్ 9వ తేదీ నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. గత ఏడు రోజుల్లో అంటే మార్చి 12-18 మధ్య కాలంలో 4,929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆదివారం నాటికి 6వేలు దాటింది. తాజా గణాంకాలు దేశంలో మళ్లీ కోవిడ్ ఉధృతి మొదలైందనడానికి అద్దంపడుతున్నాయి. ఇదిలాఉంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, మరణాల సంఖ్యసైతం పెరుగుతోంది. ఏడు రోజుల్లోనే దేశంలో 19 కోవిడ్ మరణాలు నమోదు కావటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

Covid-19: మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ .. ఒకే రోజు 800 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో అధికం

గడిచిన ఏడురోజుల వ్యవధిలో( శనివారం నాటికి) గుజరాత్ లో 660 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రంలో 1,165, కేరళ రాష్ట్రంలో 739, కర్ణాటక రాష్ట్రంలో 656 ఇలా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజు 72 కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ పాజిటివ్ పెరుగుదల నేపథ్యంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు