Corona Spread : కరోనా విలయం.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

ప్రస్తుత లెక్కల ప్రకారం ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అత్యంత ఉధృతంగా కరోనా కేసులు నమోదవుతాయని భావిస్తున్నట్లు మ్యాథమెటిక్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా అన్నారు.

Corona Spread : కరోనా విలయం.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

Corona (3)

Corona spread from one to four : దేశంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విలయం తాండవం చేస్తున్నాయి. దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఒకరి నుంచి నలుగురికి కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్లు ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు వారు ఆర్-నాట్ (ఆర్ జీరో) విలువను లెక్కించగా 4గా నమోదైంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అత్యంత ఉధృతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని భావిస్తున్నట్లు మ్యాథమెటిక్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా తెలిపారు. ప్రజలు గుమిగూడకుండా నివారణ చర్యలు కఠినతరం చేయడం, క్వారంటైన్ ను పక్కాగా అమలు చేస్తే ఆర్-నాట్ విలువ తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

Omicron India : భారత్ లో 3,623 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్-నాట్ విలువ 2.69గా ఉన్నట్లు గత వార లెక్క గట్టింది. రెండో దశ ఉధృతిలో ఈ విలువ గరిష్టంగా 1.69గా నమోదైనట్లు పేర్కొంది. కాగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ఎఫెక్ట్ 90-95 శాతం తక్కువగా ఉంటుందని హెల్త్ మెట్రిక్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టఫర్ ముర్రే అంచనా వేశారు. భారత్ లో ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఫిబ్రవరిలో ప్రతి రోజు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

భారత్ లో ఒకవైపు కరోనా..మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 3,623 కు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ నుంచి 1409 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి.

Corona India : భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు

మరోవైపు దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో మరోసారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 327 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే 12 శాతం కోవిడ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యక్టీవ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటి వరకు 3,55,28,004 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4,83,790 మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 41,434 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 18,802, ఢిల్లీలో 20,181, తమిళనాడులో 10,978, కర్ణాటకలో 8906 కేసులు, కేరళలో 5944 నమోదు అయ్యాయి.