కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు

  • Published By: madhu ,Published On : January 30, 2020 / 03:42 AM IST
కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు

కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందికి ఈ వైరస్ సోకిందని తెలుస్తోంది. చైనా, జర్మని, కెనడా, నేపాల్, శ్రీలంకతో సహా మరో 8 దేశాల్లోనూ ఈ వైరస్ పాకింది.

వైరస్‌ను నియంత్రించడానికి చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. 
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ సిటీ..ప్రావిన్స్‌లో ఉంది. 
ప్రావిన్స్‌లోని అన్ని నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. 
ప్రావిన్స్‌లోనే అధిక సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. 

కరోనా విస్తరిస్తున్నందున ప్రపంచదేశాలను WHO అప్రమత్తం చేసింది. చైనాలో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన వారు భయాందోళనలకు గురవుతున్నారు. వారి కుటుంసభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. తమ దేశానికి చెందిన ముగ్గురు పౌరులను తీసుకెళ్లినట్లు జపాన్ ప్రకటించింది.  ఇక భారతదేశానికి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ప్రావిన్స్‌కు అన్ని రకాల రవాణా మార్గాలపైన ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. 
ప్రస్తుతం 17 నగరాల్లో వైరస్ వ్యాపించిందని అంచనా. 
ఇక వైరస్ సోకిన వారిని ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 

చైనాకు రెండు విమానాలు పంపి..భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటోంది. చైనా దౌత్య అధికారులతో భారత రాయబార కార్యాలయం చర్చలు జరుపుతోంది. భారత ఎంబసీని సంప్రదించని వారి కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. 

కానీ అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. 
వైరస్ లక్షణాలున్న ప్రయాణీకులను గుర్తించడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రాయాల్లో తర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Read More : జాబ్ ఎందుకు..షాహిన్‌బాగ్‌లో కూర్చో..రూ. 1000, బిర్యానీ ఇస్తారు