ఢిల్లీలో 40లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులున్నాయన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 01:24 PM IST
ఢిల్లీలో 40లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులున్నాయన్న కేజ్రీవాల్

దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివి మరియు గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివేనని కేజ్రీవాల్ తెలిపారు.

కరోనా వైరస్ ఢిల్లీ వ్యాప్తి చెందట్లేదని ఇది తనకు తనకు నమ్మకం కలిగిస్తుందని,కరోనా కంట్రోలో లోనే ఉందని ఆప్ అధినేత అన్నారు. ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని ఆయన సృష్టం చేశారు. 11మంది కరోనా పేషెంట్లు ఐసీయూలో ఉన్నారని,ఐదుగురు వెంటిలేరట్లపై ఉన్నారని,మిగిలిన వారందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేజ్రీవాల్ శనివారం(ఏప్రిల్-4,2020)తెలిపారు.

తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న 500మంది హాస్పిటల్స్ లో ఉన్నారని,1800మంది క్వారంటైన్ లో ఉన్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. వీరందరికీ కరోనా టస్ట్ లు జరుగుతున్నాయని,దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని కేజ్రీవాల్ హింట్ ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2900 మార్క్ దాటింది. 68మంది ప్రాణాలు కోల్పోయారు.. అయితే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 30శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివే. తబ్లిగీ జమాత్ ప్రభావంతో 17రాష్ట్రాలకు కరోనా వైరస్ పాకింది. దేశం మొత్తం కరోనా కేసుల్లో 1023 కేసులు తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారివేనని కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది.