15 రోజులు ప్రయాణాలు మానుకోండి, రాష్ట్ర ప్రజలకు సీఎం విజ్ఞప్తి

రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం

  • Published By: veegamteam ,Published On : March 15, 2020 / 02:09 PM IST
15 రోజులు ప్రయాణాలు మానుకోండి, రాష్ట్ర ప్రజలకు సీఎం విజ్ఞప్తి

రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం

రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా సంస్థలు, మాల్స్, థియేటర్లు మార్చి 31వ తేదీ వరకు మూసేశాయి. కరోనా కట్టడిలో భాగంగా  15 రోజుల పాటు రాష్ట్రం వెలుపల ప్రయాణాలు మానుకోవాలని తమిళనాడు రాష్ట్ర ప్రజలను సీఎం పళనిస్వామి కోరారు. తమిళనాడు రాష్ట్రం దాటి బయటకు వెళ్లకపోవడమే మంచిదన్నారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వేడుకలు పెట్టుకోకపోవడమే మంచిదని సూచించారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను కోరారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లడమే బెటర్ అని సీఎం అన్నారు. మరో 15 రోజుల పాటు అందరూ జాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ ని కట్టడి చేయొచ్చన్నారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా ఇప్పటికే స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. నర్సరీ నుంచి 5వ క్లాస్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు మార్చి 31వ వరకు మూసివేశారు. ఇక రాష్ట్ర సరిహద్దుల్లోని 16 జిల్లాలకు చెందిన ప్రాంతాల్లో మాల్స్, సినిమా థియేటర్లు మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశించారు.

వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లొద్దని సీఎం కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. బయటి నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నారు. ఎక్కువమంది పిల్లలు ఒక చోట చేరకుండా చూడాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం రూ.60 కోట్ల నిధులు విడుదల చేసింది. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడే వారు జనాల్లో తిరుగుతుంటే వారిని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Also Read | అందుకే ఎన్నికలు వాయిదా : జగన్ ఆరోపణలపై రమేశ్ కుమార్ కౌంటర్