కరోనా ఫీవర్ : బెంగళూరు ఇన్ఫోసిస్ IIPM ఆఫీసు ఖాళీ

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 08:08 AM IST
కరోనా ఫీవర్ : బెంగళూరు ఇన్ఫోసిస్ IIPM ఆఫీసు ఖాళీ

కరోనా భయం అందరిలోను పట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది మంది మృతి చెందుతున్నారు. దేశాలకు పాకుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్‌‌ బారిన పడకుండా..ఉండేందుకు తగిన చర్యలు తీసుకొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని ఎయిర్ పోర్టులో ఉంచి..క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే…వెంటనే వారిని ప్రత్యేకంగా ఉంచి..చికిత్సలు అందిస్తున్నారు.

తాజాగా సాప్ట్ వేర్ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌కు కరోనా ఫీవర్ పట్టుకుంది. బెంగళూరు రాష్ట్రంలోని ఈ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానం వచ్చింది. వెంటనే ఇన్ఫోసిస్ ఐఐపీఎం కార్యలయాన్ని ఖాళీ చేయించింది. ముందు జాగ్రత్తగా, అప్రమత్తం చేసే భాగంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ వెల్లడించింది. అయితే..ఆ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నాయా ? లేవా ? అనేది నిర్ణారించలేదని తెలుస్తోంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ కంపెనీకి చెందిన 12కి పైగా వివిధ కార్యాలయాలున్నాయి.  

ఈ విషయంలో ఉద్యోగస్తులు ఆందోళన, భయం చెందాల్సిన అవసరం లేదని, తాము అన్న విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్ పాండే వెల్లడించారు. కరోనా వైరస్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని ఉద్యోగులకు సూచనలు చేసింది. ఇప్పటికే ఈ విషయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇంటి నుంచే పని చేయాలని, కరోనా వైరస్ లక్షణాలు ఉంటే..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. కర్ణాటక ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఒక వారం పాటు..ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు 83 నిర్ధారించినట్లు, కర్ణాటక రాష్ట్రంలోనే 6 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 

Read More : ఏపీలో ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ లేదు!