మీడియాకు నో ఎంట్రీ : యూపీలో 15జిల్లాలకు సీల్…మాస్క్ లు తప్పనిసరి

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 12:16 PM IST
మీడియాకు నో ఎంట్రీ : యూపీలో 15జిల్లాలకు సీల్…మాస్క్ లు తప్పనిసరి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 343 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న 15 జిల్లాల‌ను పూర్తిగా బంద్ చేసేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

లక్నో, అగ్ర, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), కాన్పూర్, వారణాసి, షమ్లి, మీరట్, బరేలి, బులంద్ షేర్, ఫిరోజాబాద్, మహారాజ్ గంజ్, సీతాపూర్, షహరన్ పూర్, బస్తి వంటి కరోనా హాట్ స్పాట్ జిల్లాలను బుధవారం అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 15 వరకు పూర్తిగా సీల్ వేయనున్నట్లు యూపీ చీఫ్ సెక్రటరీ తెలిపారు.

ఈ ఏరియాల్లోని ప్రజలకు నిత్యవసర వస్తువులను 100శాతం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. మరోవైపు ఎసెన్షియల్ వర్క్ కోసం ఇళ్ల నుంచి బయటికి వచ్చేవాళ్లు తప్పనిసరిగా మాస్క్ మాస్క్ లేదా క్లాత్ తప్పనిసరి అని యూపీ ప్రభుత్వం ప్రజలను ఆదేశించిందన్నారు. డోర్ టూ డోర్ చెకింగ్ ఉంటుందన్నారు. ఎవనైనా మాస్క్ ధరించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. హాట్ స్పాట్ జిల్లాల్లోకి మీడియా వ్యక్తులకు ప్రవేశం ఉండదని తెలిపింది.

అవసరమైతే రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించేందుు సిద్ధమేనని యోగి సర్కార్ తెలిపింది. ఒక్కరికి కరోనా ఉన్న లాక్ డౌన్ ఎత్తివేయడం చాలా కష్టమవుతుందని,కాబట్టి కొంచెం లాక్ డౌన్ ను పొడిగిస్తామని,రాష్ట్రంలో కరోనా లేదు అన్న భరోసా వచ్చాకే లాక్ డౌన్ ఎత్తివేయబడుతుందని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్థి తెలిపారు. డోర్ టూ డోర్ చెకింగ్ ఉంటుందన్నారు. ఎవనైనా మాస్క్ ధరించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.