ఎండలు ఉంటే కరోనా రాదా ?

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 02:42 AM IST
ఎండలు ఉంటే కరోనా రాదా ?

ప్రపంచాన్ని కుమ్మేస్తూ..ఎంతో మందిని బలి తీసుకుంటున్న ఈ రాకాసి అంతమయ్యేదెప్పుడూ ? ఇంకా ఎంతమందిని చంపేస్తుంది ? దీనికి విరుగుడు లేదా ? ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. కానీ..వేడి వాతావరణంలో ఈ వైరస్ మనుగడ సాగించదని కొంతమంది శాస్త్రవేత్తలు వెల్లడిస్తుండడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. కేసులు, మరణాల సంఖ్య వేడి ప్రాంతాల దేశాల్లో తక్కువగా ఉండడం దీనికి బలం చేకూరుతోంది. ఆయా దేశాల్లో ఉన్న వారు కొంత ఊపిరిపీల్చుకుంటున్నారు.(చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు హతం)

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి..వాతావరణానికి లింక్ ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెంపరేచర్స్ పెరుగుతున్నా కొద్ది…వైరస్ తగ్గుముఖం పడుతుందంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం మార్పులు తప్పవని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటే బెటర్ అని సూచిస్తున్నారు.

ప్రస్తుతం భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా ఉష్ణ మండల దేశాలున్నాయని, మిగతా దేశాలతో పోలిస్తే..ఇక్కడ కరోనా వ్యాప్తి ఇప్పటికీ 4 శాతం కంటే తక్కువ ఉందని చెబుతున్నారు. కానీ వేడి వాతవరణం వైరస్ నుంచి కాపాడుతుందని స్పష్టంగా చెప్పలేమని మరోసారి వెల్లడిస్తున్నారు. చైనా నుంచి ఈ రాకాసి..ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని 100 నగరాలను ఒక్కసారిగా పరిశీలిస్తే…గాలిలో తేమ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి..మిగతా నగరాల కంటే..తక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న వూహాన్ లో దాదాపు 2 వేల 300 మంది చనిపోయారని, అప్పటికి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ     తక్కువగా ఉందని అంచాన వేశారు. టెంపరేచర్స్ అధికమౌతున్న కొద్ది..మరణాల సంఖ్య క్రమంగా తక్కువవుతూ వచ్చాయని వెల్లడిస్తున్నారు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా..ప్రజలు మాత్రం జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలని సూచిస్తున్నారు.