ఉంటామో, పోతామో.. కరోనా భయంతో ముందుగానే ఆస్తి పంపకాలు చేస్తున్న సంపన్నులు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చిన్న, పెద్ద.. ముసలి, ముతక.. పేద, ధనిక... అనే తేడా లేదు అందరిని కరోనా వణికిస్తోంది. కరోనా భయంతో జనాలు

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 04:18 AM IST
ఉంటామో, పోతామో.. కరోనా భయంతో ముందుగానే ఆస్తి పంపకాలు చేస్తున్న సంపన్నులు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చిన్న, పెద్ద.. ముసలి, ముతక.. పేద, ధనిక… అనే తేడా లేదు అందరిని కరోనా వణికిస్తోంది. కరోనా భయంతో జనాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చిన్న, పెద్ద.. ముసలి, ముతక.. పేద, ధనిక… అనే తేడా లేదు. అందరిని కరోనా కాటేస్తోంది. కరోనా భయంతో జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా మహమ్మారి అటాక్ చేస్తుందోనని హడలిపోతున్నారు. సామాన్యుల పరిస్థితి పక్కన పెడితే సంపన్నులు మరీ ఎక్కువగా భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి సంపన్నుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వారికి ప్రాణభయం పట్టుకుంది. వైరస్‌ ఎప్పుడు.. ఎవరికి.. సోకుతుందో తెలియక ధనవంతులు కలవర పడుతున్నారు. ఉంటామో, పోతామో అని టెన్షన్ పడుతున్నారు.

ముందస్తుగా ఆస్తుల పంపకంపై దృష్టి:
కరోనా భయం కమ్మేస్తున్న నేపథ్యంలో కొందరు సంపన్నులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందస్తుగా ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ప్రస్తుతం దేశంలో కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీలు 108 ఉన్నాయి. తక్కువ టర్నోవర్‌ ఉన్న కుటుంబ వ్యాపారాలకు లెక్కే లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మన దేశంలోని 97శాతం కుటుంబ వ్యాపారాల్లో వారసత్వంపై సరైన మార్గదర్శకాలుగానీ, పత్రాలుగానీ లేవు. వీరిలో కొందరు ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టారు. వీలునామా ముసాయిదా తయారు చేయిస్తున్నారు. ఇదే నిజమే అని, వీలునామా ముసాయిదా చేయాలంటూ కొన్నిరోజులుగా తమకు వినతులు పెరిగాయని న్యాయ సేవలు అందించే సంస్థలు తెలిపాయి.

భార్యాపిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం వీలునామా:
వీలునామా లేకుంటే భవిష్యత్తులో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందిపడతారని తమ క్లయింట్లు గుర్తిస్తున్నట్టు కొందరు లాయర్లు తెలిపారు. ఇన్నాళ్లూ తీరిక లేకుండా గడిపిన వ్యాపారవేత్తలు ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారని, కరోనా గురించి ఎక్కువగా వినడం వల్ల వారిలో తెలియకుండానే ఒక రకమైన భయం మొదలైందని మరికొందరు చెబుతున్నారు. దీంతో వారి భార్యాపిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట. కరోనా భయంతోపాటు మార్కెట్లు నష్టాల్లో నడుస్తుండటం, ఆర్థిక వ్యవస్థ పతనమవుతుండటం వంటి కారణాల వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు:
ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం కంటిన్యూ అవుతోంది. 205 దేశాలకు కరోనా విస్తరించింది. కరోనా మహమ్మారి ఒక్క రోజులోనే 5,500 మందిని బలి తీసుకుంది. అన్ని దేశాల్లో కలిపి కొవిడ్ మృతుల సంఖ్య 64వేల 716కు పెరిగింది. ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 12లక్షలు దాటింది. మొత్తం 2.46లక్షల మంది కోలుకున్నారు. ఇటలీలో 1,24,632 కరోనా కేసులు, 15,362 మరణాలు నమోదయ్యాయి. స్పెయిన్ లో 1,24,736 కేసులు, 11,744 మరణాలు సంభవించాయి. అమెరికాలో కేసులు 3లక్షల 11వేలకి, మరణాలు 8వేల 452కి పెరిగాయి. ఫ్రాన్స్ లో 82 వేల కేసులు, 7,560 మరణాలు నమో దయ్యాయి. శనివారం ఒక్కరోజే 1,053 మంది చనిపోయారు. చైనాలో కేసులు మరో 19 పెరిగి 81,639కి చేరాయి. మరో 4 మరణాలతో మృతుల సంఖ్య 3,326కు పెరిగింది.