ముంబయి మురికివాడల్లోకి కరోనా వైరస్..నలుగురికి పాజిటివ్

  • Published By: madhu ,Published On : March 27, 2020 / 07:53 AM IST
ముంబయి మురికివాడల్లోకి కరోనా వైరస్..నలుగురికి పాజిటివ్

కరోనా వైరస్ కి తారతమ్యం లేదు. ధనికులు, సామాన్య, పేద, మధ్య తరగతి వారు అంటూ తేడా లేదు. ధనికుడి నుంచి సామాన్యుడి వరకు ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఎంతో మందిని కబళించి వేస్తోంది. దేశ వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబాయి మురికివాడల్లోకి కూడా  ఈ వైరస్ ప్రబలింది. ఇప్పటికే 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఇక్కడ ఉన్న ఇక్కడి వారు గుడిసెల్లోనే ఉండిపోయారు. తాజాగా నలుగురు వ్యక్తులకు పాజిటివ్ తేలిందనే సమాచారం కలకలం రేపుతోంది. భారత దేశంలోని అన్ని నగరాల్లో మురికవాడలున్నాయి. 175 కి.మీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న ముంబయి..ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందింది. అలాంటి ఈ మురికివాడలో కరోనా వైరస్ వ్యాపించింది.

పరేల్ లోని చాల్ నివాసం ఉంటున్న కాలినా (65), జంబ్లిపాడ మురికివాడలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల మహిళకు, ఘాట్ కోపర్ లోని 25 ఏళ్ల వ్యక్తికి, ఇదే మురికివాడకు చెందిన మరో మహిళలో వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ క్రమంలో వైరస్ రెండో దశ నుంచి మూడో దశకు చేరుకుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభాదేవి ప్రాంతంలో 65 సంవత్సరాల వృద్ధురాలు ఫుడ్ వ్యాపారం చేసేది. ఇక్కడకు ఎంతో మంది వచ్చేవారు. జంబ్లిపాడ మురికివాడో నివాసం ఉన్న వ్యక్తి ఇటలీలో వెయిటర్ గా పనిచేశాడు.

అయితే…ఘట్ కోపర్ కేసు ఆసక్తికరంగా ఉంది. 68 సంవత్సరాల వృద్ధురాలు గత వారం పరీక్షలు చేయించుకోగా..నెగటివ్ వచ్చింది. కానీ..వారం వ్యవధి తర్వాత కస్తూర్బాలో మరోసారి వైద్య పరీక్షలు చేయగా..పాజిటివ్ వచ్చింది. ఈమె కుటుంబసభ్యులకు పరీక్షలు చేస్తే..నెగటివ్ గా రావడం గమనార్హం. ఈమె నివాసం ఉండే..మురికివాడలో 25 సంవత్సరాల యువకుడు పాజిటివ్ పరీక్ష వచ్చింది. 

ముంబయిలో మురికివాడల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. బస్తీల్లోని ఇళ్లకు కనీసం కిటికీలు కూడా సరిగా ఉండవు. ఇరుకు ఇరుకు సందుల్లోనే జనాలు నివాసం ఉంటుంటారు. ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ పై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స చేస్తున్న, వైరస్ వ్యాపించకుండా కృషి చేస్తున్న వారందరికీ చప్పట్లతో అభినందించాలని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఉండే వారి నివాసాలకు బాల్కానీలు ఉండవని, ఏ ఇంటికి కిటికీలు ఉండవని వెల్లడించారు.