Coronavirus in India : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదు కాగా, 1,399 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Coronavirus in India : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

Coronavirus In India India Reports 2,483 New Cases And 1,399 Deaths In Last 24 Hours

Coronavirus in India :  భారత్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో గతకొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు పెరుగుతు వచ్చాయి. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. అయితే మంగళవారం (ఏప్రిల్ 26)న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదు కాగా, 1,399 కరోనా మరణాలు నమోదయ్యాయి. గతంలో నమోదైన కరోనా మరనాలను కోవిడ్ మరణాలుగా గుర్తించారు. దాంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరిగినట్టుగా కనిపించింది.

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 15,636 ఉండగా.. మొత్తంగా 0.04 శాతంగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 4,30,62,569 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మరణాలు కూడా 5,23,622 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 98.75గా కరోనా రికవరీ రేటు నమోదైంది.

సోమవారం ఒక్కరోజున 1970 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,23,311కు చేరింది. మరోవైపు.. కరోనా కేసుల పెరుగుదలతో కోవిడ్ పరీక్షలను కూడా పెంచాయి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు.. దాంతో దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 83.54 కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,49,197 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 83,54,69,014 టెస్టులను నిర్వహించారు.

Read Also : AP Covid-19 : ఏపీలో తొలిసారి ‘జీరో’ కోవిడ్ కేసులు..