Coronavirus : భారత్‌‌లో తగ్గుతున్న కరోనా కేసులు

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా ఇంకా కొనసాగుతోంది. గురువారం 24 లక్షల 84 వేల 412 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 1,78,29,13,0

Coronavirus : భారత్‌‌లో తగ్గుతున్న కరోనా కేసులు

India Corona

Coronavirus In India : భారతదేశంలో కరోనా భూతం మెల్లిమెల్లిగా వదులుతోంది. పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ఎంతో మంది మృత్యువాత పడ్డారు. అయితే పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది. కొత్తగా 6 వేల 396 కోవిడ్ వెలుగు చూసినట్లు, ఈ వైరస్ బారిన పడి 201 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 13 వేల 450 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 69 వేల 897గా ఉంది. మొత్తం కేసులు 4,29,44,995 ఉండగా మరణాల సంఖ్య 5,14,589కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 23 లక్షల 67 వేల 070గా ఉంది.

Read More : Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా ఇంకా కొనసాగుతోంది. గురువారం 24 లక్షల 84 వేల 412 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 1,78,29,13,060కు చేరింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల 12 వేల 832 కేసులు వెలుగు చూశాయి. 18,98,069 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. మొత్తం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 44,19,90,464కు చేరింది. కొత్తగా 7 వేల 625 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 60,00,811కు చేరింది.